Tummala: దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతులకు ఇబ్బందులు
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:10 AM
దిగుమతి సుంకం తగ్గింపుతో పామాయిల్ రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): దిగుమతి సుంకం తగ్గింపుతో పామాయిల్ రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే దేశీయ ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 40 శాతానికి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యర్థించినప్పటికీ, దీనికి విరుద్ధంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమన్నారు.
ఈ నిర్ణయం వల్ల ఆయిల్ పామ్ రైతులకు గెలల ధర తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్ పామ్ సాగును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి తుమ్మల శనివారం లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:10 AM