ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss World Arrivals: ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక

ABN, Publish Date - May 05 , 2025 | 03:41 AM

మిస్‌ వరల్డ్‌ పోటీలకు సంబంధించిన 90 మంది అందగత్తెలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారి రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం సందడిగా మారింది, మరియు టూరిజం శాఖ ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది

మిస్‌ వరల్డ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరీమణులు

  • నేడు రానున్న మరికొందరు

  • 90 మంది అందగత్తెల రాకతో శంషాబాద్‌లో సందడి

హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, మే 4(ఆంధ్రజ్యోతి): మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న సుందరీమణులకు టూరిజంశాఖ అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం మిస్‌ బ్రెజిల్‌ జెస్సీకా స్కాండుజ్‌ పెద్రోసో, మిస్‌ సౌత్‌ఆఫ్రికా జోయాలిజే జాన్సన్‌వాన్‌ రెన్స్‌బర్గ్‌తోపాటు 90 మంది పోటీదారులు హైదరాబాద్‌ చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం మరికొందరు పోటీదారులు వచ్చే అవకాశం ఉంది. అందగత్తెలు ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. అనంతరం వారిని ఆయా హోటళ్లకు తరలించారు. కాగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అతిథులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ను టూరిజం శాఖ అందుబాటులోకి తెచ్చింది.

Updated Date - May 05 , 2025 | 03:41 AM