ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MPL Halts Operations: గేమర్లకు అలర్ట్..పాపులర్ మనీ గేమ్స్ కీలక నిర్ణయం..

ABN, Publish Date - Aug 22 , 2025 | 08:29 PM

గేమింగ్ ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణపై కఠినమైన నిబంధనలు వచ్చిన నేపథ్యంలో, పలు ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. WinZO, PokerBaazi, MPL, Zupee వంటి రియల్ మనీ గేమింగ్ కంపెనీలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

MPL Halts Operations

మీరు ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుంటారా. అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్స్‌పై భారత పార్లమెంట్‌లో ఇటీవల కొత్త బిల్ పాస్ అయ్యింది. దీంతో ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే WinZO, PokerBaazi, MPL, Zupee లాంటి ప్లాట్‌ఫామ్‌లు తమ రియల్ మనీ గేమ్స్‌ని నిలిపివేశాయి. ఇది గేమర్స్‌కి, అటు కంపెనీలకి చాలా ముఖ్యమైన అప్డేట్ అని చెప్పవచ్చు.

కొత్త బిల్ ఏం చెబుతోంది?

ఈ బిల్ ఆన్‌లైన్ గేమింగ్‌లో రియల్ మనీ ఆటలను పూర్తిగా నిషేధిస్తోంది. అంటే డబ్బు పెట్టి ఆడే రమ్మీ, పోకర్, ఫాంటసీ క్రికెట్ లాంటి గేమ్స్ ఇకపై ఆడలేం. కానీ, ఈ-స్పోర్ట్స్, ఫ్రీ-టు-ప్లే సోషల్ గేమ్స్‌ని ప్రోత్సహిస్తోంది. అంటే, డబ్బు లేకుండా ఆడే గేమ్స్‌ ఆడుకోవచ్చు. దీంతో పలు కంపెనీలు వాటి గేమింగ్ రూల్స్ మార్చినట్లు ప్రకటించాయి.

పెద్ద కంపెనీలు ఏం చేశాయి?

WinZO: ఈ ప్లాట్‌ఫామ్‌లో 100కి పైగా రియల్ మనీ గేమ్స్ ఉండేవి. రమ్మీ, సోలిటైర్, ఫాంటసీ క్రికెట్ లాంటివి. కానీ, కొత్త బిల్ తర్వాత వీళ్లు తమ రియల్ మనీ గేమ్స్‌ని వెంటనే నిలిపివేశారు.

PokerBaazi: Nazara Technologiesకి చెందిన ఈ కంపెనీ కూడా తమ రియల్ మనీ ఆఫరింగ్స్‌ని సస్పెండ్ చేసింది. Nazara దీనిలో 46.07% వాటా కలిగి ఉంది.

MPL (Mobile Premier League): 120 మిలియన్ యూజర్లతో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ కూడా రియల్ మనీ గేమ్స్‌ని ఆపేసింది. యూజర్లు తమ వాలెట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు, కానీ కొత్త డిపాజిట్లు స్వీకరించడం లేదు.

Zupee: ఈ కంపెనీ కూడా రియల్ మనీ గేమ్స్‌ని ఆపేసింది. కానీ, Ludo Supreme, Snakes & Ladders లాంటి ఫ్రీ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.

యూజర్లు ఏం చేయాలి?

మీ గేమింగ్ వ్యాలెట్‌లో డబ్బులు ఉన్నా కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని కస్టమర్లకు MPL ప్లాట్‌ఫామ్‌ సూచించింది. యూజర్లు తమ బ్యాలెన్స్‌ని సులభంగా విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కానీ ఇకపై రియల్ మనీ గేమ్స్ ఆడే ఛాన్స్ లేదు. ఫ్రీ గేమ్స్‌తో సరదాగా ఆడొచ్చు, కానీ డబ్బు సంపాదించే ఆప్షన్ బంద్.

ఇండియా గేమింగ్ మార్కెట్

India Gaming Report 2025 ప్రకారం ప్రపంచ గేమింగ్ యూజర్ బేస్‌లో ఇండియా 20% వాటా కలిగి ఉంది. గ్లోబల్ గేమింగ్ యాప్ డౌన్‌లోడ్స్‌లో 15.1% మనవి. 2024లో ఇండియా గేమింగ్ మార్కెట్ విలువ $3.7 బిలియన్లు, 2029 నాటికి ఇది $9.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అంటే 19.6% వృద్ధి రేటు. గత ఐదేళ్లలో $3 బిలియన్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 1,800కి పైగా గేమింగ్ స్టార్టప్‌లు ఉన్నాయి.

  • ఈ బిల్ గేమింగ్ ఎకోసిస్టమ్‌ని సురక్షితంగా ఉంచుతుంది. ఆపరేటర్లు, అడ్వర్టైజర్లు, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీలపై కఠిన రూల్స్, జరిమానాలు విధిస్తోంది. యూజర్లను కాపాడుతుంది.

  • రియల్ మనీ గేమ్స్‌పై నిషేధం వల్ల మొబైల్ గేమింగ్, టోర్నమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం తగ్గిపోతుంది. చిన్న స్టార్టప్‌లకి భారం అవుతుంది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌లో ఇన్నోవేషన్ కూడా తగ్గొచ్చు.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 08:30 PM