Calling Screen Changed: అకస్మాత్తుగా మారిన కాలింగ్ స్క్రీన్..ఈ స్మార్ట్‌ఫోన్‌లకు ఏమైంది
ABN, Publish Date - Aug 23 , 2025 | 05:52 PM
ఇటీవల మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాల్ చేయాలనుకున్నప్పుడు, స్క్రీన్ కొత్తగా కనిపించిందా. అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది మీ ఫోన్‌కి వచ్చిన కొత్త అప్‌డేట్ వల్లే, మార్పులు వచ్చాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు జరిగాయే ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? ఇటీవల మీ ఫోన్‌లో కాలింగ్ స్క్రీన్ ఏదో కొత్తగా, వింతగా కనిపించిందా? ఏమైందా అని టెన్షన్ పడొద్దు. ఇది గూగుల్ ఫోన్ యాప్‌కి వచ్చిన కొత్త అప్‌డేట్ వల్ల జరిగిన మార్పు. ఈ అప్‌డేట్‌లో గూగుల్ తన మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ డిజైన్‌ని మార్పు చేసింది. దీనివల్ల మన ఫోన్ యాప్‌కి ఓ ఫ్రెష్, మోడర్న్ లుక్ వచ్చేసింది.
దీంతో మీరు ఫోన్ యాప్ ఓపెన్ చేస్తే, ముందు కాంటాక్ట్స్ సెక్షన్ కొంచెం డిఫరెంట్‌గా (Calling Screen Changed) కనిపిస్తుంది. ఇంతకు ముందు మన ఫేవరెట్ కాంటాక్ట్స్, రీసెంట్ కాంటాక్ట్స్ వేర్వేరు ట్యాబ్‌లలో ఉండేవి కదా? ఇప్పుడు వాటిని ఒకే ట్యాబ్‌లోకి తెచ్చేశారు. పైన ఫేవరెట్ కాంటాక్ట్స్ ఒక కారౌసెల్‌లా (అంటే స్లయిడ్‌లా) కనిపిస్తాయి. కింద రీసెంట్ కాంవర్సేషన్స్ ఒక బాక్స్‌లో ఉంటాయి.
స్క్రీన్‌లో కొత్త ట్విస్ట్
ఇంతకు ముందు ఫ్లోటింగ్ బటన్‌గా ఉండే కీప్యాడ్ ఇప్పుడు దిగువన ఒక సెపరేట్ ట్యాబ్‌గా మారింది. కాంటాక్ట్స్ కూడా పైన కొత్త నావిగేషన్ బార్‌లోకి వెళ్లిపోయాయి. అయినా, ఆ పాత మూడు డాట్ మెనూ నుంచి వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఇదంతా కొత్తగా అనిపించినా, ఒకటి రెండు రోజులు యూజ్ చేస్తే అలవాటైపోతుంది. ఇప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం.
ఇప్పుడు మాత్రం..
మీ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు, కాల్ ఆన్సర్ చేయడానికి లేదా రిజెక్ట్ చేయడానికి ఇంతకు ముందు స్క్రీన్‌పై పైకి లేదా కిందకి స్వైప్ చేసేవాళ్లం కదా? ఇప్పుడు ఆ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు హారిజాంటల్‌గా, అంటే ఎడమ నుంచి కుడికి లేదా కుడి నుండి ఎడమకి స్వైప్ చేయాలి. ఎందుకు ఈ మార్పు అంటే, ఫోన్‌ని పాకెట్ నుంచి తీసేటప్పుడు అనుకోకుండా కాల్ ఆన్సర్ అయిపోతుంది లేదా రిజెక్ట్ అయిపోతుంది. ఈ హారిజాంటల్ స్వైప్ వల్ల ఆ ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఈ స్వైపింగ్ మీకు ఇష్టం లేకపోతే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి ట్యాప్ ఆప్షన్ మార్చుకోవచ్చు.
కాల్ స్క్రీన్‌లో బటన్స్ కూడా
కాల్ స్క్రీన్‌లో ఉండే బటన్స్ కూడా కొత్త లుక్‌లో వచ్చాయి. ఇప్పుడు అవి రౌండెడ్ కార్నర్స్‌తో కనిపిస్తాయి. ఇంకా ఎండ్ కాల్ బటన్‌ని కాస్త పెద్దగా చేశారు. తద్వారా ఈజీగా కనిపిస్తుంది. చిన్న చిన్న మార్పులే అయినా, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరచడానికి ఈ చేంజెస్ బాగా హెల్ప్ చేస్తాయి. గూగుల్ మరో కొత్త ఫీచర్‌పై కూడా వర్క్ చేస్తోంది. ఇది ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. రానున్న రోజుల్లో ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌పై కాంటాక్ట్‌ల ఫుల్ స్క్రీన్ ఫోటోస్ కనిపించే అవకాశం ఉంది. దీన్ని కాంటాక్ట్ కార్డ్ ఫీచర్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇది బీటా టెస్టర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది.
క్లాక్ యాప్‌కి కొత్త లుక్
ఫోన్ యాప్ మాత్రమే కాదు, గూగుల్ ఆండ్రాయిడ్ క్లాక్ యాప్‌కి కూడా మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ కొత్త డిజైన్‌లో బాటమ్ బార్ కాస్త పొడవుగా ఉంటుంది. ఇంతకు ముందు సెంటర్‌లో ఉండే సర్క్యులర్ ఫ్లోటింగ్ బటన్ ఇప్పుడు స్క్వేర్ షేప్‌లో, కార్నర్‌లోకి మారింది.
ఇంకా, యాక్టివ్ అలారమ్స్‌ని హైలైట్ చేయడానికి విభిన్న కలర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ మార్పులు క్లాక్ యాప్‌ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తాయి. ఈ కొత్త అప్‌డేట్స్ మన ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ని మరింత సులభతరం చేయడానికి, స్టైలిష్‌గా కనిపించేలా డిజైన్ చేశారు. మొదట్లో కొత్తగా అనిపించినా, కొన్ని రోజులు యూజ్ చేస్తే అవి సూపర్ కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 23 , 2025 | 05:52 PM