Fastest Mobile Internet Speed: జపాన్, అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత స్పీడ్ ఇంటర్నెట్ ఎక్కడుందో తెలుసా..
ABN, Publish Date - Jul 20 , 2025 | 05:19 PM
ప్రపంచంలో అత్యంత స్పీడ్ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయో ఊహించగలరా? జపాన్, అమెరికా అనుకుంటే మాత్రం పొరపడినట్లే. దీని గురించి ఇటీవల స్పీడ్‌టెస్ట్ నివేదిక కీలక విషయాలను ప్రస్తావించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయో తెలుసా. జపాన్, అమెరికా మాత్రం కాదు. స్పీడ్‌టెస్ట్ నివేదిక ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో (Fastest Mobile Internet Speed) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సగటున 546.14 మెగాబిట్స్ పర్ సెకండ్ (Mbps) వేగంతో ఇంటర్నెస్ సేవలు ఉన్నాయి.
మరోవైపు ఇంటి బ్రాడ్‌బ్యాండ్ వేగంలో మాత్రం సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున 393.15 Mbps వేగంతో కలదు. అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, భారత్ వంటి దేశాలు తమ టెలికాం సౌకర్యాలను వేగంగా మెరుగుపరుస్తున్నప్పటికీ, వాటి మొబైల్, ఇంటి ఇంటర్నెట్ వేగాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి.
మొబైల్ ఇంటర్నెట్ వేగంలో టాప్ 10 దేశాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) - 546.14 Mbps
ఖతార్ - 517.44 Mbps
కువైట్ - 378.45 Mbps
బహ్రెయిన్ - 236.77 Mbps
బ్రెజిల్ - 228.89 Mbps
బల్గేరియా - 224.46 Mbps
దక్షిణ కొరియా - 218.06 Mbps
చైనా - 201.67 Mbps
సౌదీ అరేబియా - 198.39 Mbps
డెన్మార్క్ - 196.27 Mbps
ఇంటి బ్రాడ్‌బ్యాండ్ వేగంలో టాప్ 10 దేశాలు
సింగపూర్ - 393.15 Mbps
హాంగ్ కాంగ్ - 323.87 Mbps
ఫ్రాన్స్ - 319.43 Mbps
చిలీ - 318.84 Mbps
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) - 313.90 Mbps
ఐస్‌లాండ్ - 299.21 Mbps
అమెరికా - 287.59 Mbps
దక్షిణ కొరియా - 279.73 Mbps
మకావు - 264.13 Mbps
రొమేనియా - 259.50 Mbps
ఇండియా ఎక్కడ..
ఈ డేటా స్పీడ్‌టెస్ట్ వెబ్‌సైట్ https://www.speedtest.net/global-index నుంచి జూన్ 2024 నుంచి జూన్ 2025 వరకు సేకరించిన సమాచారం. ఇక భారత్ విషయానికి వస్తే ఈ ర్యాంకులో గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు, ఎందుకంటే టాప్ 20లో కూడా లేదు. మొబైల్ ఇంటర్నెట్ వేగంలో ఇండియా 26వ స్థానంలో, సగటున 133.51 Mbps వేగంతో ఉంది. మరోవైపు ఇంటి బ్రాడ్ బ్యాండ్ వేగంలో భారత్ 98వ స్థానంలో, సగటున కేవలం 59.51 Mbps వేగంతో వెనుకబడింది. నేపాల్ కూడా ఇంటి బ్రాడ్‌బ్యాండ్ వేగంలో 88వ స్థానంలో ఉంది. సగటున 77.90 Mbps వేగంతో, భారత్ కంటే మెరుగైన పనితీరును అందిస్తోంది.
సవాళ్లు, అవకాశాలు
భారత్‌లో గతంలో కంటే ఇంటర్నెట్ వినియోగం పెరిగినా కూడా, ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ఈ డేటా చూస్తే తెలుస్తుంది. ఇంటి బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. రోజువారీ జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ విద్య, ఈ-కామర్స్ వంటి అవసరాలకు ఇంటర్నెట్ తప్పనిసరి అవసరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫైబర్ ఆప్టిక్ సౌకర్యాలు పెంచడం, టెలికాం సంస్థలు మరింత సమర్థవంతమైన సేవలను అందించడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చు.
ఇవి కూడా చదవండి
వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 20 , 2025 | 06:27 PM