Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:51 PM
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే వారం ఏకంగా 10 ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతో మార్కెట్లో డబ్బుల వర్షం కురియనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో (Stock Market) మళ్లీ ఐపీఓల (Next Week IPOs) వీక్ రానే వచ్చేసింది. గత కొన్ని వారాలుగా మార్కెట్లోకి కొత్త కంపెనీలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈసారి దాదాపు 10 కొత్త కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని కంపెనీలు కూడా ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కానున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
వచ్చే వారం రానున్న కొత్త కంపెనీల IPOలు
ఇండిక్యూబ్ స్పేసెస్ ఐపీఓ: ఈ IPO పరిమాణం రూ. 700 కోట్లు కాగా, ఇందులో రూ. 650 కోట్ల తాజా ఇష్యూ, రూ. 50 కోట్ల OFS వాటా ఉన్నాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ IPO ధర పరిధి ఈక్విటీ షేరుకు రూ.225 నుంచి రూ. 237 వరకు నిర్ణయించారు. దీని ముఖ విలువ రూ.1గా నిర్ణయించారు.
GNG ఎలక్ట్రానిక్స్ IPO: ఈ IPO పరిమాణం రూ.460 కోట్లు. ఇందులో రూ.400 కోట్ల తాజా ఇష్యూ, రూ.60 కోట్ల OFS ఉన్నాయి. GNG ఎలక్ట్రానిక్స్ IPO ధర ఈక్విటీ షేరుకు రూ. 225 నుంచి రూ. 237గా ప్రకటించారు. దీని ముఖ విలువ రూ. 2.
సావీ ఇన్‌ఫ్రా & లాజిస్టిక్స్ IPO: రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన సావీ ఇన్‌ఫ్రా, రూ. 69.98 కోట్ల IPOను ప్రారంభిస్తోంది. ఈ ఆఫర్ జూలై 21 నుంచి జూలై 23 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 114 నుంచి రూ. 120 వరకు ఉంది.
స్వస్తిక్ కాజిల్ IPO: ఇంజనీరింగ్ విడిభాగాల తయారీ సంస్థ స్వస్తిక్ కాజిల్, ఒక్కో షేరుకు రూ. 65 ధరతో రూ. 14.07 కోట్ల IPOతో వస్తుంది. ఇది 21.64 లక్షలకు పైగా షేర్లను జారీ చేయనుంది. హారిజన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్వస్తిక్ కాజిల్ IPOకి లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుంది.
మోనార్క్ సర్వేయర్స్ & ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ IPO: ఈ కంపెనీ జూలై 22న తన IPOను ప్రారంభించనుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 93.75 కోట్లు సేకరించాలనే లక్ష్యంతో ఉంది. ఈ IPO ఇష్యూ ధర రూ. 237 నుంచి రూ. 250 మధ్య ఉంటుంది.
TSC ఇండియా IPO: టెక్నాలజీ, సర్టిఫికేషన్ సేవలను అందించే కంపెనీ TSC ఇండియా, రూ. 68 నుంచి రూ. 70 ధరల శ్రేణితో రూ. 25.89 కోట్ల IPOను ప్రారంభించనుంది. TSC ఇండియా లిమిటెడ్ అనేది క్లయింట్‌లకు ఎయిర్ టికెటింగ్ సేవలను అందించే ట్రావెల్ మేనేజ్‌మెంట్ సంస్థ.
పటేల్ కెమ్ స్పెషాలిటీస్ IPO: ఈ కంపెనీ జూలై 25న రూ. 58.80 కోట్ల IPOను ప్రారంభించి, జూలై 29న ముగుస్తుంది. ఈ ఇష్యూ ధర పరిధి రూ. 82 నుంచి రూ. 84 మధ్య ఉంటుంది. పటేల్ కెమ్ స్పెషాలిటీస్ లిమిటెడ్ (PCSL) ఔషధ ఎక్సిపియెంట్లు, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రాప్‌షేర్స్ టైటానియా IPO: ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT) రెండో స్కీం అయిన టైటానియా, జూలై 21న సబ్‌స్క్రిప్షన్ కోసం రూ. 473 కోట్ల IPOను ప్రారంభించనుంది. జూలై 25న ముగిసే ఈ IPO ధర బ్యాండ్ రూ. 10-10.6 లక్షలుగా నిర్ణయించబడింది.
బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ IPO: ఈ IPOలో రూ. 759.60 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయనున్నారు. ఈ IPO ధరను మరికొన్ని రోజుల్లో ప్రకటించబడే అవకాశం ఉంది. ఈ ఇష్యూకు ప్రధాన నిర్వాహకులు JM ఫైనాన్షియల్ లిమిటెడ్, ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్, రిజిస్ట్రార్ KFin టెక్నాలజీస్ లిమిటెడ్.
శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ IPO: ఈ IPOలో 1,80,96,000 ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంది. ఆఫర్-ఫర్-సేల్ (OFS) లేదు. శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ IPO ధరలు కూడా మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ IPO కోసం ఛాయిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుంది. బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూ రిజిస్ట్రార్‌ను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి