ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TikTok Back India: ఐదేళ్ల తర్వాత మళ్లీ వచ్చిన టిక్‌టాక్.. కానీ ఈసారి మాత్రం

ABN, Publish Date - Aug 22 , 2025 | 09:12 PM

టిక్‌టాక్ మళ్లీ వచ్చింది. ఐదేళ్ల క్రితం భారత్‌లో బ్యాన్ అయిన టిక్‌టాక్ ఇప్పుడు మళ్లీ ఓపెన్ అవుతోంది. టిక్‌టాక్ వెబ్‌సైట్ ఇప్పుడు భారత్‌లో కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

TikTok Back India

ఒకప్పుడు మన దేశంలో కోట్లాది మంది యువతను ఆకట్టుకున్న టిక్‌టాక్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత దేశ భద్రతాపరమైన కారణాలతో టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌పై భారత్ బ్యాన్ విధించింది. ఆ సమయంలో టిక్‌టాక్ భారత్‌లోనే దాదాపు 200 మిలియన్ యూజర్లు ఉన్న అతిపెద్ద యాప్‎గా నిలిచింది.

కానీ ఇప్పుడు టిక్‌టాక్ యాప్‌ మాత్రం ఇంకా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ లలో అందుబాటులో లేదు. కానీ కొన్ని రోజులుగా TikTok వెబ్‌సైట్‌ను భారత్‌లోని కొంతమంది యూజర్లు యాక్సెస్ చేస్తున్నారు. అంటే ఇది మళ్లీ ఇండియాలోకి రాబోతుందా అనే చర్చ మొదలైంది.

TikTok పోయిన తర్వాత

టిక్‌టాక్ నిషేధం తర్వాత, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు మనదేశంలో ఎన్నో ఇండియన్ షార్ట్ వీడియో యాప్స్ వెలుగులోకి వచ్చాయి. వాటిలో మోజ్ (Moj), జోష్ (Josh), చింగారి (Chingari), ఎంఎక్స్ టకటక్ (MX TakaTak), గ్లోబల్ ప్లేయర్స్ అయిన Instagram Reels, YouTube Shorts కూడా అదే అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాయి. అయితే గత రెండు మూడేళ్లలో చూసుకుంటే, ఆ వీడియో యాప్స్‌లో చాలావరకు మూసివేశాయి లేదా పెద్ద కంపెనీలతో కలిసిపోయాయి. అంటే సీన్ మళ్ళీ ఓ కొత్త ప్లేయర్‌కి సిద్ధంగా ఉందన్నమాట.

టిక్‌టాక్ మళ్లీ వస్తుందా?

ఇటీవల ఇండియా–చైనా సంబంధాలు కొంత మెరుగవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Shein, Xender, TanTan వంటి కొన్ని చైనా యాప్స్‌ మళ్లీ ఇండియన్ యాప్ స్టోర్స్‌కి తిరిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ వెబ్‌సైట్ యాక్సెస్‌ కూడా లభిస్తుంది. కానీ అధికారికంగా యాప్‌ మళ్లీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఎందుకు గవర్నమెంట్ తొందర?

టిక్‌టాక్ ఓసారి దేశంలోకి ప్రవేశిస్తే, అది ఓ పెద్ద కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ టూల్ అవుతుంది. అందుకే అమెరికాలో కూడా ట్రంప్‌ తొలిసారిగా నిషేధించాలని ట్రై చేసినా, టిక్‌టాక్ తమ మార్కెట్‌ను కాపాడుకుంది. ఇక్కడ ఇండియా విషయంలో ప్రభుత్వం అంత తొందర చూపించకపోవచ్చు. టిక్‌టాక్ చైనాలో Douyin అనే వేరియంట్‌ను, ప్రపంచానికి TikTok వేరియంట్‌ను వాడుతుంది. ఇవి వేర్వేరుగా నడుస్తూ, వాళ్ల వ్యూవర్ బేస్‌ను పెంచుకున్నాయి.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 09:13 PM