ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gen AI Buildathon: ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ కలిసి జెన్ ఏఐ బిల్డ్‌థాన్ ప్రారంభం..

ABN, Publish Date - Aug 29 , 2025 | 09:53 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ (NIAT) కలిసి ప్రారంభించిన జెన్ ఏఐ బిల్డ్‌థాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల యువతను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Gen AI Buildathon

దేశంలో ఏఐ రంగంలో అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ (NIAT) కలిసి జెన్ ఏఐ బిల్డ్‌థాన్‎ను ప్రారంభించాయి. ఇది భారతదేశంలో కాలేజీ విద్యార్థుల కోసం రూపొందించిన అతిపెద్ద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్‌ఏఐ) ఆవిష్కరణ సవాల్. ఈ బిల్డ్‌థాన్ ద్వారా విద్యార్థులు ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రిటైల్, సుస్థిరత, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఏఐ ఆధారిత వినియోగం, పరిష్కారాల గురించి తెలుసుకుంటారు.

ఈ కార్యక్రమం ద్వారా యువత ఆవిష్కరణ శక్తిని ప్రోత్సహిస్తూ, జనరేటివ్ ఏఐ, నూతన సాంకేతికతలపై ప్రాజెక్టులు రూపొందించేందుకు అవకాశం కల్పిస్తారు. దీంతో విద్యార్థులు తమ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావచ్చు. ఈ సవాల్‌లో మీరు కూడా పాల్గొని పోటీ పడవచ్చు. దీనిలో మూడు ప్రధాన థీమ్‌లు ఉంటాయి. ఎవ్రీడే ఇండియా కోసం ఏఐ, భారత్ వ్యాపారాల కోసం ఏఐ, సామాజిక మేలు కోసం ఏఐ అనే థీమ్ లు ఉన్నాయి. ఈ బిల్డ్‌థాన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కార్యక్రమాల కలయికతో హైబ్రిడ్ రూపంలో జరుగుతుంది.

స్క్రీనింగ్ రౌండ్: విద్యార్థులు మొదట 6 గంటల ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఇందులో జెన్‌ఏఐ ఆధారాలు, ఓపెన్‌ఏఐ ఏపీఐ ఉపయోగం, ఏజెంట్ బిల్డింగ్, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి గురించి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత జట్లు తమ ప్రాజెక్ట్ ఆలోచనలు, అమలు ప్రణాళికలను ఆన్‌లైన్‌లో సమర్పిస్తాయి. ఈ సమర్పణలను మెంటార్ల బృందం సమీక్షించి, ఉత్తమ ఎంట్రీలను సెలక్ట్ చేస్తుంది.

రీజినల్ ఫైనల్స్: ఎంపికైన జట్లు 25-30 STEM కళాశాలల్లో నిర్వహించబడే 48 గంటల ఆఫ్‌లైన్ బిల్డ్‌థాన్లో పాల్గొంటాయి. అక్కడ వారు మెంటార్ల మార్గదర్శనంలో తమ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తారు. ఈ దశలో రీజినల్ విజేతలు ప్రకటించబడతారు.

గ్రాండ్ ఫైనల్: రీజినల్ ఫైనల్స్ నుంచి ఎంపికైన 10-15 జట్లు గ్రాండ్ ఫైనల్‌లో ఓపెన్‌ఏఐ ఇండియా టీమ్ ముందు తమ పరిష్కారాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తాయి.

పాల్గొనే వారికి అద్భుతమైన అవకాశాలు

ఈ బిల్డథాన్‌లో పాల్గొనే వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఎంపికైన జట్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఏఐ నిపుణుల నుంచి శిక్షణ, మార్గదర్శనం పొందుతారు. అగ్రస్థానంలో నిలిచిన జట్లకు సర్టిఫికెట్లు, ప్రోటోటైపింగ్ కోసం GPT+ క్రెడిట్స్, జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తాయి. విజేతలకు బహుమతి, ఓపెన్‌ఏఐ ఇకోసిస్టమ్‌లో కెరీర్ అవకాశాలు, గ్రాండ్ ఫైనల్‌లో ఓపెన్‌ఏఐ ఇండియా టీమ్‌కు ప్రత్యక్షంగా అవకాశం లభిస్తుంది.

భారతదేశ ఏఐ భవిష్యత్తును రూపొందించే సవాల్

నెక్స్ట్‌వేవ్ (NIAT) నేతృత్వంలో నిర్వహించబడుతున్న ఈ బిల్డ్‌థాన్, భారత యువతను భవిష్యత్ సాంకేతికతలలో నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉంది. ఓపెన్‌ఏఐ అకాడమీ తన నిపుణుల మార్గదర్శనం, బ్రాండింగ్, అత్యాధునిక సాధనాలతో ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

ఉపయోగించే ఏఐలు

పాల్గొనేవారు GPT-4.1, GPT-4o, GPT-4o ఆడియో, GPT-4o రియల్‌టైమ్ మోడల్స్ వంటి అత్యాధునిక ఏఐ సాధనాలను ఉపయోగించవచ్చు. ఇవి టెక్స్ట్, ఇమేజ్, ఆడియో వంటి మల్టీమోడల్ ఇన్‌పుట్‌లకు సపోర్ట్ చేస్తాయి. దీంతోపాటు LangChain, వెక్టార్ డేటాబేస్‌లు (Pinecone, Weaviate), MCPs, ఓపెన్‌ఏఐ ఏజెంట్స్ వంటివి కూడా విద్యార్థులకు అధిక ప్రభావవంతమైన జెన్‌ఏఐ అప్లికేషన్‌లను రూపొందించేందుకు సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 10:08 PM