ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

iOS 26 Hidden Features: ఐఫోన్ యూజర్లూ.. మీకు ఈ ఫీచర్ల గురించి తెలుసా?

ABN, Publish Date - Dec 20 , 2025 | 10:30 PM

కొత్త ఐఓఎస్‌లో యూజర్లకు తెలియని పలు ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

iOS 26 hidden features

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ యూజర్లను తాజా ఐఓఎస్ వర్షన్ బాగా ఆకట్టుకుంటోంది. లిక్విడ్ గ్లాస్ డిజైన్, స్మార్టర్ కాల్ స్క్రీనింగ్ వంటి అద్భుత ఫీచర్ల గురించి ప్రచారం బాగానే జరిగింది. కానీ పెద్దగా ప్రచారానికి నోచుకోని కొన్ని ఫీచర్లు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఫోల్డర్ కస్టమైజేషన్

ఫైల్స్ యాప్‌ను యాపిల్ ఈసారి మరింత రంగులమయంగా చేసిందది. కొత్త ఐఓఎస్‌లో యూజర్లు తమ ఫోన్‌లోని ఫోల్డర్‌లను అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే.. ఫోల్డర్‌లకు నచ్చిన రంగులు అద్దడం, ఐకాన్లు, ఎమోజీలను జోడించడం వంటివి చేయొచ్చు. దీంతో, ఒక్క చూపులోనే కావాల్సిన ఫోల్డర్ కంటపడుతుందన్నమాట. ఇందుకోసం కస్టమైజ్ ఫోల్డర్ అండ్ ట్యాగ్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి అందులో నచ్చిన రంగు, సింబల్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఐప్యాడ్, మ్యాక్‌తో కూడా సింక్ అయిపోతుంది.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు స్పామ్ మెసేజీలు, కాల్స్ బాగా విసుగు తెప్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, వీటిని ఫిల్టర్ చేసేందుకు ఐఓఎస్ 26లో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే గుర్తు తెలియని కాల్స్ ఆటోమేటిక్‌గా, ఎలాంటి శబ్దం చేయకుండా మరో లిస్టులోకి వెళ్లిపోతాయి. ప్రధాన లిస్టుకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేయడంతో యూజర్లకు స్పామ్ బెడద చాలా వరకూ తగ్గిపోతుంది. దీన్ని ఆన్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోని యాప్స్ ఆప్షన్‌ను ఎంచుకుని అందులో ఫిల్టర్ స్పామ్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి.

ఒక్కోసారి మనం ముఖ్యమైన వ్యక్తులకు కూడా కాల్ చేయడం మర్చిపోతాము. ఆ తరువాత ఎప్పుడో ఇది గుర్తొచ్చి నెత్తి బాదుకుంటాము. ఈ సమస్యకు ఐఓఎస్ 26లో ఓ పరిష్కారం ఉంది. అదే కాల్ బ్యాక్ రిమైండర్. మిస్డ్ కాల్ వచ్చినప్పుడు ఫోన్ యాప్‌లోకి వెళ్లి ఎడమవైపునకు స్వైప్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై కనబడే క్లాక్ ఐకాన్2పై టాప్ చేసి మళ్లీ ఎప్పుడు ఆ కాల్ గురించి గుర్తు చేసేలా టైమ్ సెట్ చేసుకోవాలి.

తాజా ఐఓఎస్ వర్షన్‌లోని కొత్త ఫీచర్‌తో ఎయిర్‌పాడ్స్‌ను కెమెరా షట్టర్‌గా వాడుకొవచ్చు. కొన్ని రకాల ఎయిర్‌పాడ్స్‌ మోడల్‌లో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఎయిర్‌పాడ్స్‌ను ఐఫోన్‌తో జత చేయాలి. రిమోట్ కెమెరా ఆప్షన్‌‌లో ప్రెస్ యాక్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో, ఎలాంటి కంగారు లేకుండా ఫొటోలు తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఫీచర్‌ల్లను వాడుకోండి.

ఇవీ చదవండి:

అమెజాన్ అలెక్సా వాడేవారికి ఓ గుడ్ న్యూస్..

ఏఐ బాట పడుతున్న భారతీయులు.. ప్రపంచంలోనే నెం.1

Updated Date - Dec 21 , 2025 | 07:56 AM