ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Whatsapp: వాట్సాప్‌లో డిలీట్ చేసిన చాట్స్‌ను తిరిగి పొందాలనుకుంటే.. ఇలా చేయండి..

ABN, Publish Date - Jun 23 , 2025 | 03:10 PM

వాట్సాప్‌లో డిలీట్ చేసిన చాట్‌ను తిరిగి సులువుగా పొందవచ్చు. అది ఎలాగంటే..

సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపించడానికి వాట్సప్ ఒక వేదికగా మారింది. అయితే కొన్నిసార్లు మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు లేదా చాట్ను డిలీట్ చేసినప్పుడు తిరిగి వాటిని పొందాలంట ఇలా చేయవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో పొరపాటున చాట్‌ను డిలీట్ చేస్తాం. మరికొన్ని సమయాల్లో చాట్‌ను కావాలని డిలీట్చే చేసేస్తాం. మరి ఎప్పుడైనా వాటిని తిరిగి పొందాలనుకుంటే వాట్సప్‌లో వాటిని రీస్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పిస్తోంది.

అయితే ఎప్పుడైనా చాట్‌ను డిలీట్ చేయకముందే బ్యాకప్ చేసుంటే.. ఆ చాట్‌ను సులువుగా తిరిగి పొందవచ్చు. దీనిని ఉపయోగించడానికి ముందుగా ఫోన్‌లోని వాట్సప్‌ను అన్ఇన్‌స్టాల్ చేసి.. తిరిగి గూగుల్ ప్లే స్టోర లేదా యాప్ స్టోర్ నుంచి వాట్సప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా తిరిగి వాట్సప్‌ను డౌన్‌లోనడ్ చేసిన అనంతరం, మీ ఫోన్ నెంబర్‌తో ధృవీకరించుకుని రిస్టోర్ అనే ఆప్షన్ కనిపించినప్పుడు దాన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా చేస్తే వాట్సప్‌లో చాట్ బ్యాకప్ చేసుకోవచ్చు.

ఈ విధంగా పూర్తి మెసేజ్‌లను రికవరీ చేసుకోవచ్చు. అయితే చాట్‌లను డిలీట్ చేయకముందు బ్యాకప్ చేసుకున్న సందర్భాల్లో మాత్రమే రికవరీ చేసే వెసులుబాటు ఉంది. అయితే బ్యాకప్ గడువు ముగిసిన అనంతరం అందుకున్న లేదా పంపిన మెసేజ్‌లను తిరిగి పొందే అవకాశం లేదు. ఈ బ్యాకప్ కోసం ముందుగా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో తగినంత స్టోరేజ్ స్సేస్ ఉండేలా చూసుకోవాలి. వాట్సప్ సెట్టింగ్స్‌లో ఉండే బ్యాకప్‌ను అనేబుల్ చేయడం వల్ల చాట్‌లు ఆటోమేటిక్‌గా బ్యాకప్ అవుతాయి. తద్వారా డిలీట్ చేసిన చాట్‌ను ఎప్పుడైనా తిరిగి పొందే వీలు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

యూఎస్‌లో ఆందోళనలు.. పలు నగరాల్లో హై అలర్ట్

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

For More International News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 03:10 PM