High Alert: యూఎస్‌లో ఆందోళనలు.. పలు నగరాల్లో హై అలర్ట్
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:21 PM
అమెరికాలోని పలు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన బాట పట్టారు. దీంతో పలు నగరాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా హై అలర్ట్ ప్రకటించారు.
వాషింగ్టన్, జూన్ 23: ఇజ్రాయెల్‌కు మద్దతుగా.. ఇరాన్‌లోని కీలక అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం పట్ల ఆ దేశ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో సోమవారం యూఎస్‌లోని బోస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్ తదితర నగరాల్లో ప్రజలు రహదారులపైకి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వవద్దని.. ఇరాన్‌ను వదిలి పెట్టాలంటూ వారు ప్లకార్డులు చేత పట్టి బిగ్గరగా నినాదాలు చేశారు.
ఇరాన్‌తో ఉన్న వివాదాన్ని సైతం నిరోధించాలని ఈ సందర్భంగా అమెరికాను వారు కోరారు. అలాగే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం మానేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సూచించారు. అదే విధంగా ఇరాన్‌తో యూదు దేశం వివాదంలో ఇకపై అమెరికాకు ఎటువంటి ప్రమేయం ఉండకూడదని వారు స్పష్టం చేశారు. అందు కోసం ప్రదర్శనకారులు బ్యానర్లు పట్టుకుని యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇంకోవైపు అమెరికా వైమానిక దాడులపై ఇక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వానీ స్పందారు. ఆ క్రమంలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినా.. తమ మాటను అమెరికా పెడ చెవిన పెట్టిందని పేర్కొన్నారు. అమెరికాపై ఎప్పుడు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సైన్యం చూసుకుంటుందని ఇర్వానీ స్పష్టం చేశారు. అంతకు ముందు ఇరానీ సుప్రీం కమాండర్ ఖమేనీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై నిప్పులు చెరిగారు. కానీ ఇరాన్‌లోని అణు స్థావరాలపై వైమానిక దాడులు చేసిన అమెరికాను ఒక్క మాట అనకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ
For More International News and Telugu News