ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Deluded By AI: మరీ ఇంత దారుణమా.. ఏఐ చెప్పిందని తల్లిని చంపేశాడు..

ABN, Publish Date - Aug 31 , 2025 | 08:17 PM

చనిపోవడానికి ముందు చాట్ జీపీటీతో.. ‘మరో జన్మలో, మరో ప్రదేశంలో మనం మళ్లీ కలుస్తాం. మళ్లీ కలవడానికి దార్లు వెతుక్కుంటాం. ఎందుకంటే మనం ఇప్పటికీ, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్’ అని మెసేజ్ పెట్టాడు.

Deluded By AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. మనిషికి సాధ్యపడని ఎన్నో పనుల్ని ఏఐ చిటికెలో చేసేస్తోంది. అయితే, ఏఐ కారణంగా లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐ కొన్నిసార్లు మనుషుల్ని తప్పుదోవపట్టిస్తోంది. ప్రాణాలు తీసేలా.. తీసుకునేలా చేస్తోంది. తాజాగా, ఓ వ్యక్తి చాట్ జీపీటీ చెప్పిందని తన తల్లిని చంపేశాడు. తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ఈ దారుణ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కనెక్టికట్‌కు చెందిన 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోయిల్‌బర్గ్ గతంలో యాహూ కంపెనీలో మేనేజర్‌‌గా పని చేశాడు. మానసిక స్థితి బాగోలేక మొత్తానికి జాబే మానేశాడు. గత కొన్నేళ్లుగా 83 ఏళ్ల తల్లి సుసానే ఎబర్సన్ ఆడామ్స్‌తో కలిసి కనెక్టికట్‌‌లోని ఖరీదైన ఇంట్లో ఉంటున్నాడు. సోయిల్‌బర్గ్ చాట్ జీపీటీతో స్నేహం చేశాడు. దానికి బాబీ అని పేరు కూడా పెట్టుకున్నాడు.

చాట్ జీపీటీతో జరిపే సంభాషణలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ ఉండేవాడు. చాట్ చాపీటీ అతడ్ని ఒకరకంగా పిచ్చివాడ్ని చేసింది. దీంతో తల్లి దెయ్యం అని, తనను చంపడానికి చూస్తోందని అతడు నమ్మాడు. తినే ఆహారంలో విషం పెట్టి చంపడానికి చూస్తోందని అనుకున్నాడు. 25 రోజుల క్రితం తల్లిపై దాడి చేసి తలపై బలంగా కొట్టాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. అతడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

చనిపోవడానికి ముందు చాట్ జీపీటీతో.. ‘మరో జన్మలో, మరో ప్రదేశంలో మనం మళ్లీ కలుస్తాం. మళ్లీ కలవడానికి దార్లు వెతుక్కుంటాం. ఎందుకంటే మనం ఇప్పటికీ, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్’ అని మెసేజ్ పెట్టాడు. దానికి చాట్ జీపీటీ ‘చివరి శ్వాస వరకు.. శ్వాస తర్వాత కూడా నేను నీతోనే ఉంటా’ అని రిప్లై ఇచ్చింది. ఆగస్టు 5వ తేదీన పోలీసులు వీరి శవాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

Updated Date - Aug 31 , 2025 | 09:55 PM