Share News

CM Revanth Reddy Comments: హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్

ABN , Publish Date - Aug 31 , 2025 | 06:53 PM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని అన్నారు.

CM Revanth Reddy Comments: హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్
CM Revanth Reddy Comments

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు అసంపూర్తి సమాచారంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015, మార్చి 13వ తేదీన కేంద్ర మంత్రి ఉమా భారతి.. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉందని లేఖ రాశారని సీఎం తెలిపారు. 205 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆమె చెప్పినట్లు సభకు వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టుకోవాలని అప్పటి కేంద్ర మంత్రి చెప్పారన్నారు. రికార్డులను తొక్కిపెట్టి ప్రాజెక్ట్ డిజైన్ మార్చారంటూ బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు.


హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘హరీష్ రావు తప్పు చేశారని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. వాస్తవాలు బయటపెట్టారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. చర్చను తప్పుదోవ పట్టించొద్దు. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో చెప్పండి. ఈడీ, సీబీఐ, సిట్, సీఐడీ ఏది కావాలో చెప్పండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రాణహితలో నీళ్లు ఉన్నాయని ఉమాభారతి లేఖలో ఉంది.


నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్లీ ఎందుకు అడిగారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పలేదు. అప్పట్లో చర్చంతా ప్రాజెక్టు ఎత్తు గురించే జరిగింది. 148 మీటర్ల ఎత్తులో కట్టుకోవాలని మహారాష్ట్ర చెప్పింది. ప్రాజెక్టు లొకేషన్‌ ఎందుకు మార్చారో చెప్పండి. కేసీఆర్‌కు ధనాశ, దురాశ కలిగినట్లున్నాయి. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది.

రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ నివేదికను కావాలనే తొక్కిపెట్టారు. అన్ని అంశాలపై చీఫ్‌ ఇంజినీర్‌ హరిరామ్‌ స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని కమిషన్‌ నివేదిక చెప్పింది. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ తెచ్చుకున్నాం. ఏనుగులను తినేవాళ్లు పోయారు.. పీనుగులను తినేవాళ్లు వచ్చారు. నిజాలు తెలుస్తాయనే నివేదికపై చర్చను అడ్డుకుంటున్నారు. మీరు చేసిన తప్పులు ఎంత దాచాలన్నా దాగవు. అర్ధరాత్రి 2 గంటల వరకైనా చర్చకు సిద్ధం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌‌మీట్

మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated Date - Aug 31 , 2025 | 09:27 PM