Harish Rao VS Congress: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌పై హరీష్‌రావు ఫైర్
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:51 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమైందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్‌కు, తనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) ఎన్ని రోజులైనా చర్చిద్దామని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు నిజాలు తెలియాలని చెప్పుకొచ్చారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై లఘుచర్చను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరీష్‌రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతి కౌంటర్ ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రతి అక్షరానికి సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది అంతా పొలిటికల్ డ్రామా అని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వం నడుపుతున్నారా..?, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్‌రావు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిష్పాక్షికంగా జరిగిందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని తుంగలో తొక్కి ఏకపక్షంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చట్టం ముందు నిలబడదని చెప్పుకొచ్చారు. కమిషన్ రిపోర్టుపై రూల్స్ పాటించనందునే తాము హైకోర్టుకు వెళ్లామని తెలిపారు. హై కోర్టులో వాదనలు ఉన్నాయని తెలిసి కూడా ఆదరాబాదరాగా రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో నివేదిక పెట్టిందని మండిపడ్డారు హరీష్‌రావు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటో అర్థమైందని విమర్శించారు. కేసీఆర్‌కు, తనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. సభ్యులకు 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వాలని చట్టంలో ఉందని ఉద్ఘాటించారు. గతంలో ఇలాంటి అంశాలపై ఇందిర, అద్వానీ కూడా కోర్టుకెళ్లారని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
For More TG News And Telugu News