Gemini Vio3: జెమిని ఏఐ వీయో 3 ఫ్రీ వీడియో జనరేషన్ ఆఫర్..ఎప్పటివరకంటే..
ABN, Publish Date - Aug 23 , 2025 | 08:09 PM
అదిరిపోయే ఏఐ వీడియోలను ఇప్పుడు ఫ్రీగా రూపొందించుకోండి. ఎలాగంటే గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించిన ప్రకారం, గూగుల్ AI వీడియో టూల్ Veo 3 కొన్ని గంటలపాటు అందరికీ ఫ్రీ వీడియో క్రియేషన్ ఆఫర్ ప్రకటించింది.
మీరు ప్రస్తుతం ఫ్రీగా ఏఐ వీడియోలు క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారా. అయితే మీకు మంచి ఛాన్సుంది. ఎందుకంటే గూగుల్ జనరేటివ్ AI వీడియో టూల్ వీయో 3(Gemini Vio3) అందరికీ ఫ్రీ వీడియో క్రియేషన్ ఆఫర్ తీసుకొచ్చింది. అవును, ఈ ఆఫర్ కేవలం కొద్ది గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఈ ఆఫర్ గురించి ప్రకటించారు.
ఆగస్టు 24, 2025 రాత్రి 10 గంటల వరకు వీయో 3ని అందరూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సమయం తర్వాత, ఈ టూల్ మళ్లీ కేవలం జెమిని ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ వీకెండ్‌ని సద్వినియోగం చేసుకోండి.
వీయో 3 అంటే ఏంటి?
వీయో 3 అనేది గూగుల్ అభివృద్ధి చేసిన అత్యాధునిక AI వీడియో జనరేషన్ టూల్. ఇది మీరు రాసిన టెక్స్ట్ ఆధారంగా చిన్న, రియలిస్టిక్ వీడియోలను సృష్టిస్తుంది. ఉదాహరణకు, మీరు సూర్యాస్తమయం వద్ద సముద్ర తీరంలో నడుస్తున్న ఒక జంట అని టైప్ చేస్తే, వీయో 3 ఆ దృశ్యాన్ని వీడియోగా మార్చేస్తుంది. ఇది యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌ల నుంచి సినిమాటిక్ సీక్వెన్స్‌లు, స్టోరీబోర్డ్‌ల వరకు అన్నింటినీ తయారు చేయగలదు.
అడ్వాన్స్‌డ్ ఏఐ
గూగుల్ ఇండియాలో వీయో 3 ఫాస్ట్ మోడల్ని కూడా పరిచయం చేసింది. ఈ మోడల్ వీడియోలను చాలా వేగంగా రూపొందిస్తుంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లు జెమిని యాప్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ ప్రకారం, వీయో 3 అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత అడ్వాన్స్‌డ్ AI వీడియో జనరేషన్ టూల్. ఇది OpenAI Sora.ai, PerplexityAI వంటి టూల్స్‌తో నేరుగా పోటీ పడుతోంది.
ఎలా ఉపయోగించాలి?
వీయో 3ని ఉపయోగించడం చాలా సులభం. మీకు జెమిని యాప్ ఉంటే, అందులోకి వెళ్లి మీ ఐడియాని టెక్స్ట్ రూపంలో టైప్ చేయండి. ఉదాహరణకు ఒక అడవిలో డైనోసార్ నడుస్తున్న దృశ్యం అని రాస్తే, కొన్ని సెకన్లలో ఆ దృశ్యం వీడియోగా మీ ముందు ఉంటుంది. మీరు ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తే, అంత ఆసక్తికరమైన వీడియోలు రూపొందించుకోవచ్చు. గూగుల్ ఈ ఆఫర్ సమయంలో అందరికీ సాఫీగా యాక్సెస్ ఉండేలా లోడ్ ఆఫ్ TPUsని సిద్ధం చేసింది. అంటే, ఎక్కువ మంది యూజర్లు ఒకేసారి ఉపయోగించినా ఎలాంటి ఆటంకం ఉండదన్నమాట.
ఎందుకు ఈ ఆఫర్ ప్రత్యేకం?
సాధారణంగా, AI వీడియో జనరేషన్ టూల్స్ ఉపయోగించాలంటే, ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తీసుకోవాలి. కానీ, ఈ వీకెండ్‌లో వీయో 3ని ఉచితంగా ట్రై చేయడం ద్వారా, మీరు ఎలాంటి ఖర్చు లేకుండా AI వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 23 , 2025 | 08:33 PM