Bank Fires Longtime Employee: బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..
ABN, Publish Date - Sep 05 , 2025 | 07:47 AM
ఆ బ్యాంక్ కొన్ని పనుల కోసం ఏఐని వాడదామని డిసైడ్ అయింది. అయితే, ఏఐని వాడేముందు దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం క్యాథరిన్‌తో పాటు మరికొంతమందిని ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీమ్‌లో భాగం చేసింది.
ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఖర్చులు తగ్గించుకోవటానికి, ఎక్కువ ఉత్పాదకత కోసం కంపెనీలు ఏఐ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల్ని పని నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా, ఓ బ్యాంక్ ఉద్యోగినికి ఏఐ కారణంగా అత్యంత దారుణమైన అనుభవం ఎదురైంది. ఏఐని ట్రైన్ చేయడానికి కష్టపడ్డ ఆమె ఉద్యోగం పోయింది. ఉద్యోగిని స్థానంలో ఏఐని పెట్టుకుంది ఆ బ్యాంకు. ఇంతకీ సంగతేంటంటే.. ఆస్ట్రేలియాకు చెందిన 63 ఏళ్ల క్యాథరిన్ సుల్లీవన్ ‘ది కామన్ వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా’లో పని చేసేది.
ఆ బ్యాంక్ కొన్ని పనుల కోసం ఏఐని వాడదామని డిసైడ్ అయింది. అయితే, ఏఐని వాడేముందు దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం క్యాథరిన్‌తోపాటు మరికొంతమందిని ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీమ్‌లో భాగం చేసింది. ఏఐ కారణంగా తన భవిష్యత్తు అంధకారంలో పడుతుందని క్యాథరిన్‌కు తెలియదు పాపం. ఎంతో శ్రద్ధగా ఆ ఏఐకి ట్రైనింగ్ ఇచ్చింది. కొన్ని నెలల్లోనే ఆ ఏఐ బ్యాంకు పనుల్లో అద్భుతమైన శిక్షణ పొందింది. బ్యాంకు జులై నెలలో ఏఐని రంగంలోకి దించింది.
కొన్ని రోజులకే ఊహించని నిర్ణయం తీసుకుంది సదరు బ్యాంక్. 44 మంది ఉద్యోగులను పనిలోంచి తీసేసింది. ఆ 44 మందిలో క్యాథరిన్ కూడా ఉంది. ఏఐ కారణంగా తన ఉద్యోగం పోవటంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఆ బ్యాంకులో 25 ఏళ్ల పాటు పని చేశాను. నేను ట్రైన్ చేసిన ఏఐ నా ఉద్యోగం తీసింది. ఏఐ కారణంగా నా ఉద్యోగం పోవటంతో షాక్ అయ్యాను. మనుషుల్ని ఉద్యోగంలోంచి తీసేసి ఏఐలను పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉండాలని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వర్షాలు తగ్గుముఖం.. కోస్తాలో పెరిగిన ఎండ
Updated Date - Sep 05 , 2025 | 08:02 AM