Coastal Andhra: వర్షాలు తగ్గుముఖం.. కోస్తాలో పెరిగిన ఎండ
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:32 AM
తీవ్ర అల్పపీడనం బుధవారం రాత్రి ఉత్తర ఒడిశాలో తీరం దాటింది. తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో...
విశాఖపట్నం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): తీవ్ర అల్పపీడనం బుధవారం రాత్రి ఉత్తర ఒడిశాలో తీరం దాటింది. తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో గురువారం బలహీనపడి ఉత్తర ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతోంది. అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా ఉండడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఎండతీవ్రత కొనసాగింది. నెల్లూరులో 37.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.