Gold And Silver Rate: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:37 AM
గురువారం నాడు హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,860 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.97,650 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.80,140 దగ్గర ట్రేడ్ అయింది.
బిజినెస్ డెస్క్: బంగారం కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా.. పెట్టుబడి మార్గంగానూ మారింది. ఆదాయం ఎక్కువగా ఉన్న వారు బంగారం వైపే మొగ్గుచూపుతున్నారు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం ధరలు గత కొద్దిరోజుల నుంచి పెరుగుతూ వచ్చాయి. అయితే, శుక్రవారం మాత్రం పసిడి ప్రియులకు ఊరట లభించింది. 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి.
బంగారం ధరలు ఇలా..
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. నిన్న(గురువారం) హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,860 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.97,650 దగ్గర అమ్ముడయ్యింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.80,140 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 18, 22, 24 క్యారెట్ల బంగారంపై రూ.10లు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,850 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.97,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.80,130 దగ్గర ట్రేడ్ అవుతోంది.
నేటి వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
పసిడి కంటే వెండి ధరలు నిలకడగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం పెరగటం, తగ్గటంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి ధర రూ.13,700ల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర రూ.1,37,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈరోజు మాత్రం 100 గ్రాములపై రూ.10, కేజీపై రూ.100లు తగ్గింది. ఈరోజు 100 గ్రాముల వెండి ధర రూ.13,690 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర రూ.1,36, 900 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర ( 24 క్యారెట్స్, 1 గ్రామ్)
చెన్నై- రూ.10,686
ముంబై- రూ.10,686
ఢిల్లీ- రూ.10,701
కోల్‌కతా- రూ.10,686
బెంగళూరు- రూ.10,686
పూణె- రూ.10,686
ఇవి కూడా చదవండి
కాఫీ తోటల రైతులకు అండగా ప్రభుత్వం