AP Lorry Owners Association: రవాణాకు లాభం మెండు
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:25 AM
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో చేసిన మార్పులు రవాణా రంగానికి కొన్ని అంశాల్లో లాభదాయకంగా, మరికొన్ని అంశాల్లో అదనపు భారం వేసేలా ఉన్నాయని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్...
ఏపీ లారీ యజమానుల సంఘం
విజయవాడ సిటీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో చేసిన మార్పులు రవాణా రంగానికి కొన్ని అంశాల్లో లాభదాయకంగా, మరికొన్ని అంశాల్లో అదనపు భారం వేసేలా ఉన్నాయని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యాదర్శి వైవీ ఈశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాహనాలపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గించడంతో లారీ చాసి్‌సలు, టైర్లు, 1,500 సీసీలోపు ఉన్న కార్లు, 1,200 సీసీలోపు ఉన్న పెట్రోల్, ఎలక్ర్టిక్ కార్ల ధరలు తగ్గుతాయని, థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌పై 12 నుంచి 5 శాతం జీఎస్టీ తగ్గింపు వాహన యజమానులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఐటీసీపై 12 నుంచి 18 శాతం పెంపు పెద్ద లాజిస్టిక్ కంపెనీలపై అదనపు భారం మోపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సామాన్యులు, వ్యాపారులకు మేలు: ఏపీ చాంబర్స్
జీఎస్టీలో సంస్కరణలను రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) స్వాగతించింది. జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులు, వ్యాపారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎంఎ్‌సఎంఈలకు ఉపశమనం కల్పించడంతోపాటు కొత్త అవకాశాలను అందిస్తుందని చాంబర్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొట్లూరి భాస్కరరావు, బి.రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.