Apple Event 2025: నేడు ఆపిల్ స్పెషల్ ఈవెంట్..కొత్త ఐఫోన్ 17, వాచ్, ఇంకా బోలెడన్ని సర్ప్రైజ్‌లు
ABN, Publish Date - Sep 09 , 2025 | 09:32 AM
ఆపిల్ అభిమానులకు ఈ రోజు పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపిల్ డ్రాపింగ్ లాంచ్ ఈవెంట్ నేడు మొదలు కానుంది. నెలల తరబడి వచ్చిన లీక్‌లు, రూమర్‌లకు ఈ ఈవెంట్‌తో ఫుల్‌స్టాప్ పడనుంది.
టెక్ ప్రియులంతా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ Apple Awe Dropping Launch Event ఈరోజు (సెప్టెంబర్ 9, 2025) జరగనుంది. ఈ ఈవెంట్‌తో నెలల తరబడి వస్తున్న లీక్స్, ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడనుంది. ముఖ్యంగా iPhone 17 సిరీస్ లాంచ్‌కి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో కొత్త గ్యాడ్జెట్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను కూడా ఆపిల్ ఈ సందర్భంగా ప్రకటించనుంది. ఇండియాలో ఈ ఈవెంట్‌ను ఎలా చూడాలి? ఏం లాంచ్ కాబోతున్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఎక్కడ, ఎప్పుడు చూడాలి?
ఈ ఈవెంట్ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరుగనుంది. ఇండియాలో ఉన్న ఆపిల్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్‌ను లైవ్‌గా రాత్రి 10:30 గంటల (IST) నుంచి చూడొచ్చు.
ఆపిల్ అధికారిక వెబ్‌సైట్: apple.comలో లైవ్ స్ట్రీమ్ ఉంటుంది.
ఆపిల్ యూట్యూబ్ ఛానెల్: యూట్యూబ్‌లో ఈజీగా చూడొచ్చు
ఆపిల్ టీవీ యాప్: స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా స్మార్ట్ టీవీలో (iOS, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ) ఈ యాప్ ద్వారా చూడొచ్చు
ఏముంది కొత్తగా?
ఈ సారి ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు మోడల్స్ రాబోతున్నాయని టాక్. వాటిలో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (apple iphone 17 pro max launch), ఐఫోన్ 17 ఎయిర్. ఇది ఆపిల్ చరిత్రలోనే అతి సన్నని ఐఫోన్ అవుతుందట. ఐఫోన్ 16 ప్లస్ స్థానంలో ఈ కొత్త మోడల్ వస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌లు కొత్త డిజైన్, సూపర్‌ఫాస్ట్ ప్రాసెసర్‌లు, అద్భుతమైన కెమెరాలతో రాబోతున్నాయి.
కొత్త ఆపిల్ వాచ్‌లు
ఆపిల్ వాచ్ ఫ్యాన్స్‌కు కూడా ఈ ఈవెంట్ స్పెషల్. ఈ సారి మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ కాబోతున్నాయి. వాటిలో ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ SE 3 ఉన్నాయి. ఈ వాచ్‌లు మెరుగైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, సూపర్ పెర్ఫార్మెన్స్‌తో వస్తాయని ఆశిస్తున్నారు టెక్ ప్రియులు.
ఆడియోకి కొత్తగా..
మూడేళ్ల తర్వాత, ఆపిల్ తన ఎయిర్‌పాడ్స్ ప్రోని రిఫ్రెష్ చేయబోతోంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 3rd జనరేషన్ లాంచ్ కానుంది. ఈ సారి హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ దీనిలో ఉండొచ్చు. ఆడియో క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని అంచనా. మ్యూజిక్ లవర్స్‌కి ఇది చక్కగా ఉపయోగపడనుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్‌ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా ప్రకటించబోతున్నారు. iOS 26, iPadOS 26, watchOS అప్‌డేట్స్ రిలీజ్ డేట్స్ ఈ ఈవెంట్‌లో తెలుస్తాయి. ఈ అప్‌డేట్స్ వచ్చాక మీ డివైస్‌లు మరింత స్మార్ట్‌గా, ఫాస్ట్‌గా మారతాయి.
ఇండియన్ ఫ్యాన్స్‌కు
ఆపిల్ ఈవెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా హైప్ ఉంటుంది. కానీ ఇండియాకు ఈ సారి ఎక్స్‌ట్రా స్పెషల్. ఎందుకంటే ఇండియాలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఎయిర్‌బడ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఐఫోన్ 17 సిరీస్ ధరలు, అవైలబిలిటీ, కొత్త ఫీచర్స్ గురించి ఇండియన్ బైయర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆపిల్ కూడా ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ పెంచుతోంది కాబట్టి, ఈ ఈవెంట్ మనకు కూడా ప్రత్యేకమని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 09 , 2025 | 09:51 AM