ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

WTC Final 2025 Prize Money: దక్షిణాఫ్రికాకు భారీ ప్రైజ్ మనీ..ఆస్ట్రేలియా, భారత్, పాక్ జట్లకు ఎంత వచ్చాయంటే

ABN, Publish Date - Jun 14 , 2025 | 08:23 PM

దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.

WTC Final 2025 Prize Money

ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకున్నాయి. రెండూ ఫైనల్లో టీమిండియాను ఓడించాయి. ఈసారి కంగారూ జట్టు టైటిల్‌ను కాపాడుకోవడానికి ట్రై చేసి ఓడిపోయింది. (WTC Final 2025 Prize Money). దీంతో దక్షిణాఫ్రికా జట్టు 1998 తర్వాత మొదటిసారి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

ఇండియాకు కూడా ప్రైజ్ మనీ

ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు మంచి ప్రైజ్ మనీ (WTC Final 2025 Prize Money) కూడా దక్కించుకున్నాయి. 2023-25 ​​ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‎లో పాల్గొన్న తొమ్మిది జట్లకు ఐసీసీ భారీ మొత్తాన్ని ప్రకటించింది. మొత్తంగా ఐసీసీ ప్రైజ్ మనీ $5.76 మిలియన్లు (సుమారు రూ.49.24 కోట్లు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విజేతగా నిలిచిన జట్టు దక్షిణాఫ్రికాకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30.78 కోట్లు) అందించారు. రన్నరప్ ఆస్ట్రేలియా జట్టుకు 2.16 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.18.56 కోట్లు) సంతృప్తి చెందాల్సి వచ్చింది. టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అయినప్పటికీ ఈసారి 1.44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.13 కోట్లు) అందుకుంది.

ప్రైజ్ మనీలో పెరుగుదల

గత రెండు ఎడిషన్‌లతో పోలిస్తే 2023-25 ​​ఎడిషన్‌కు ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. 2021, 2023లో మొత్తం ప్రైజ్ మనీ $3.8 మిలియన్లు (సుమారు రూ. 32.49 కోట్లు). విజేతలు (న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) $1.6 మిలియన్లు (సుమారు రూ. 13.68 కోట్లు) అందుకున్నారు. అప్పుడు రన్నరప్ (టీమిండియా) రెండు సందర్భాలలో $0.8 మిలియన్లు (సుమారు రూ. 7.6 కోట్లు) అందుకుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ప్రైజ్ మనీ వివరాలు

  • దక్షిణాఫ్రికా విజేత రూ.30.78 కోట్లు

  • ఆస్ట్రేలియా రన్నరప్ రూ. 18.56 కోట్లు

  • భారతదేశం 3వ స్థానం రూ. 12.13 కోట్లు

  • న్యూజిలాండ్ 4వ స్థానం రూ. 10.26 కోట్లు

  • ఇంగ్లాండ్ 5వ స్థానం రూ.8.20 కోట్లు

  • శ్రీలంక 6వ స్థానం రూ.7.18 కోట్లు

  • బంగ్లాదేశ్ 7వ స్థానం రూ.6.15 కోట్లు

  • వెస్టిండీస్ 8వ స్థానం రూ.5.13 కోట్లు

  • పాకిస్థాన్ 9వ స్థానం రూ.4.10 కోట్లు

కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఇక 2025-27 కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జూన్ 20న మొదలవుతుంది. ఈసారి మొదటి సిరీస్ టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. రెండు జట్లు జూన్ 20 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 08:27 PM