ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Doping Test: డోపింగ్ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు..గతంలో కూడా..

ABN, Publish Date - Apr 20 , 2025 | 08:56 PM

రన్నింగ్ నుంచి బౌలింగ్, గోల్ఫ్ క్రీడలు ఏవైనా కూడా ప్రతీ ఆటగాడు కూడా డోపింగ్ టెస్ట్‌కు సిద్ధంగా ఉండాల్సిందే. ఇది కేవలం టెస్ట్ మాత్రమే కాదు. ఆటగాళ్లు, నిజాయితీగా ఆడుతున్నారా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. అందుకోసం ఆటగాళ్లు నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారా అనే విషయాన్ని పసిగట్టేందుకే డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. తాజాగా 10 మందిపై డోపింగ్ నిషేధం విధించిన నేపథ్యంలో దీని గురించి తెలుసుకుందాం.

Doping Test

క్రీడా ప్రపంచంలో డోపింగ్ మళ్లీ చర్చనీయాశంగా మారింది. ఎందుకంటే తాజాగా డోపింగ్ విషయంలో మరో 10 మందిపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ విధించింది. వీరిలో తెలంగాణ జూనియర్ జాతీయ జట్టు చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహిత నాగపూరి రమేష్‌తోపాటు అదనపు కోచ్‌లైన కరంవీర్ సింగ్, రాకేష్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా అసలు డోపింగ్ టెస్ట్ అంటే ఏంటి, దీనిని ఎలా నిర్వహిస్తారనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


అథ్లెట్లను యాదృచ్ఛికంగా

క్రీడా ప్రపంచంలో డోపింగ్ టెస్ట్ అనేది అత్యంత కీలకమైన ప్రక్రియ. అథ్లెట్లు నిషేధిత ఔషధాలు లేదా డ్రగ్స్ ఉపయోగించారా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. డోపింగ్ టెస్ట్‌ను ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తారు. దేశంలో దీనిని నాడా (NADA) నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ కఠినంగా, రహస్యంగా ఉంటుంది. మొదట అథ్లెట్లను యాదృచ్ఛికంగా లేదా పోటీలో వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక్కోసారి సందేహాస్పద ప్రవర్తన ఉన్నవారిని కూడా టెస్ట్‌కు పిలుస్తారు. పోటీ తర్వాత లేదా ఊహించని సమయంలో ఈ ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అథ్లెట్‌కు డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్ (DCO) నోటీసు అందిస్తారు.


నమూనా సేకరణ

మూత్ర నమూనా: ఇది అత్యంత సాధారణ పద్ధతి. అథ్లెట్‌ను ఒక ప్రైవేట్ గదికి తీసుకెళ్తారు. అక్కడ ఒక అధికారి ఉంటారు. అథ్లెట్ నామునా ఒక సీల్డ్ బాక్సులో అందించాల్సి ఉంటుంది.

రక్త నమూనా: కొన్ని సందర్భాల్లో రక్తం కూడా సేకరిస్తారు, ముఖ్యంగా హార్మోన్‌లు లేదా ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు.

నమూనా సీలింగ్ & ల్యాబ్ టెస్టింగ్: సేకరించిన నమూనాను రెండు భాగాలుగా (A, B) విభజించి, సీల్ చేస్తారు. ఈ నమూనాలను WADA లేదా NADA గుర్తింపు పొందిన ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ అత్యాధునిక సాంకేతికతతో నిషేధిత పదార్థాలను గుర్తిస్తారు.

ఫలితాలు & చర్యలు: ఫలితాలు సాధారణంగా కొన్ని వారాల్లోనే వస్తాయి. ఒకవేళ నిషేధిత పదార్థం లేదా డ్రగ్ తీసుకున్నట్లు అనిపిస్తే, B నమూనాను కూడా పరీక్షిస్తారు. రెండూ పాజిటివ్ అయితే, ఆ అథ్లెట్‌పై నిషేధం విధిస్తారు.


ఆసక్తికర విషయాలు:

ఎప్పుడైనా టెస్ట్: డోపింగ్ టెస్ట్‌లు పోటీల సమయంలోనే కాదు, శిక్షణ సమయంలో కూడా జరగవచ్చు. అథ్లెట్‌లు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి.

నీటి ట్రిక్: కొందరు అథ్లెట్లు మూత్రాన్ని పలుచన చేయడానికి ఎక్కువ నీరు తాగుతారు, కానీ ల్యాబ్‌లు ఈ ట్రిక్‌ను సులభంగా పసిగడతాయి

డోపింగ్ టెస్టులో గతంలో దొరికిన అథ్లెట్లు

నర్సింగ్ యాదవ్ (రెజ్లర్): 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు, నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. నిషేధిత పదార్థం మెథాండియనోన్‌ను ఉపయోగించినట్లు తేలింది. చివరికి నాలుగు సంవత్సరాల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

మోను ఘంగాస్ (బాక్సర్): 2018లో ఆమె డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. నాలుగు సంవత్సరాల నిషేధాన్ని అనుభవించింది.

జాకిర్ హుస్సేన్ (వెయిట్‌లిఫ్టర్): 2019లో డోపింగ్ ఉల్లంఘన కారణంగా నాలుగు సంవత్సరాల నిషేధాన్ని పొందాడు. ప్రతి ఏటా జరిగే క్రీడల్లో కూడా ఇలా అనేక మందిపై నిషేధం విధిస్తారు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 20 , 2025 | 09:03 PM