Share News

Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:02 PM

ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధుడిని అక్కడి డాక్టర్‌ సహా మరో వ్యక్తి దారుణంగా ఈడ్చుకుంటూ లాక్కేళ్లారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన జనం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Chhatarpur viral video

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఓ దారుణ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్య ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో, ఆస్పత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదంలో డాక్టర్ రాజేష్ మిశ్రా అతన్ని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జోషి ఏమన్నారంటే..

ఈ సంఘటనలో నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్యకు చికిత్స కోసం ఛతర్‌పూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. ఆ క్రమంలో టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో నిలబడ్డానని, తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి, చెంపదెబ్బ కొట్టి, తన్నాడని జోషి ఆరోపించారు. కానీ వీడియోలో ఇద్దరు వ్యక్తులు జోషిని కొడుతూ, ఆస్పత్రి నుంచి బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి జోషిని కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది.


ఆస్పత్రి సిబ్బంది వాదన

ఆయన ఆరోపణలను ఆస్పత్రి సిబ్బంది ఖండించారు. సివిల్ సర్జన్ జి.ఎల్. అహిర్వార్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఆ రోజు భారీగా జనాలు వచ్చారని తెలిపారు. ఆ క్రమంలో జోషి క్యూ దాటి ముందుకు వచ్చారని, అందుకే డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. అయితే వీడియో ఆధారాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని మరికొంత మంది చెబుతుండటం విశేషం. ఈ విషయం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది.


రాజకీయ దుమారం..

ఈ ఘటనపై మధ్యప్రదేశే కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ వీడియోను Xలో షేర్ చేస్తూ, రాష్ట్రంలో మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స బదులు హింసలు జరుగుతున్న ఈ అభివృద్ధి మోడల్ ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పాలకులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సైతం స్పందించి, దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతుండగా, డాక్టర్ కూడా జోషిపై ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 20 , 2025 | 06:03 PM