Virat Kohli Returns To Practice: ఎన్నాళ్లకెన్నాళ్లకు
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:37 AM
భారత జట్టు తదుపరి వన్డే సిరీస్ మరో రెండు నెలలకుపైగానే ఉంది. వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియాలో
విరాట్ కోహ్లీ బ్యాటు పట్టాడు
లండన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా స్టార్
అక్టోబరులో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్
లండన్: భారత జట్టు తదుపరి వన్డే సిరీస్ మరో రెండు నెలలకుపైగానే ఉంది. వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరీ్‌సలో తలపడనుంది. అందులో భాగంగా 3 వన్డేలు, 5 టీ20లలో భారత్-ఆస్ట్రేలియా ఢీకొననున్నాయి. అక్టోబరు 19న వన్డే సిరీస్ మొదలు కానుంది. వాస్తవంగా ఈ ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ఆ సిరీస్ రద్దయింది. ఇక..భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్‌సకు సన్నాహకాలు మొదలు పెట్టాడు. విరాట్ చివరిసారి మైదానంలో కనిపించి రెండు నెలలపైనే అయ్యింది. ఇక..ఇటీవల టెస్ట్‌లు, అంతకుముందు టీ20లనుంచి రిటైర్ అయిన కోహ్లీ..ఐపీఎల్ అనంతరం లండన్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు. మొత్తంగా మెగా లీగ్ అనంతరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న అతడు..వన్డేలలో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు. గుజరాత్ సహాయ కోచ్ నయీమ్ అమీన్‌తో కలిసి లండన్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో కోహ్లీ ప్రాక్టీస్ షురూ చేశాడు. ఈమేరకు ఆ ఫొటోను అతడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
Updated Date - Aug 09 , 2025 | 03:37 AM