Virat Kohli: ఆరెంజ్ క్యాప్ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..
ABN, Publish Date - May 04 , 2025 | 10:19 AM
విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో రెండుసార్లు (2016, 2024) ఆరెంజ్ క్యాప్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే 2025లో 505 పరుగులతో మరోసారి ఈ గౌరవాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం 505 పరుగులతో ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విరాట్ ఖాతాలో మరో రికార్డ్ చేరనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ టాప్ స్కోరర్ గౌరవం
ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అవార్డు లభిస్తుంది. ఈ అవార్డు ఆటగాళ్ల నైపుణ్యం, నిలకడ, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. విరాట్ కోహ్లీ ఈ గౌరవాన్ని రెండుసార్లు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2016, 2024 సీజన్‌లలో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న కోహ్లీ, 2025లో 505 పరుగులతో మరోసారి ఈ అవార్డును దక్కించుకునే ఛాన్సుంది. విరాట్ ఇదే అత్యధిక పరుగుల ట్రెండ్ కొనసాగిస్తే, మూడోసారి ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకోనున్నాడు.
కోహ్లీ రికార్డు స్థాయి ప్రదర్శన
2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శనతో 973 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో 4 సెంచరీలు, 7 అర్ధ శతకాలు చేశాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటికీ కోహ్లీ పేరిటే ఉంది. ఈ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ, ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు, అయితే టైటిల్ మాత్రం చేజారింది.
2024 రన్ మెషిన్ మరోసారి రాణింపు
2024 సీజన్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌లలో 741 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్‌ను రెండోసారి సొంతం చేసుకున్నాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలతో 154.69 స్ట్రైక్ రేట్‌తో కోహ్లీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లే-ఆఫ్‌లకు చేరినప్పటికీ, టైటిల్ గెలవలేకపోయింది.
ఆరెంజ్ క్యాప్‌తో కోహ్లీ స్థానం
2025 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి సొంతం చేసుకునే ఛాన్సుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న ఆటగాడు డేవిడ్ వార్నర్ (3 సార్లు). కోహ్లీ, క్రిస్ గేల్‌లు రెండుసార్లు ఈ గౌరవాన్ని సాధించారు. 2025లో మరోసారి ఆరెంజ్ క్యాప్ గెలిస్తే, కోహ్లీ వార్నర్ రికార్డును సమం చేస్తాడు.
రికార్డుల రారాజు
విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లలో 8004 పరుగులు సాధించాడు, ఇందులో 8 సెంచరీలు, 55 అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు కొనసాగుతోంది. అంతేకాదు, ఒకే జట్టు (ఆర్సీబీ) తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, 4000 పరుగులు సాధించిన విజయవంతమైన మ్యాచ్‌లలో తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి:
RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ కోసం ఇంకా ఎన్ని గెలవాలి
Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Business News and Latest Telugu News
Updated Date - May 04 , 2025 | 10:23 AM