Suresh Raina: ధోనీ తదుపరి ప్లాన్ ఇదే.. సురేశ్ రైనా కీలక కామెంట్స్
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:56 PM
సీఎస్‌కే తరపున ధోనీ కనీసం మరో సీజన్ అయినా ఆడతాడని క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. వచ్చేసారి అయినా చెన్నై మంచి ప్లానింగ్‌తో బరిలోకి దిగుతుందని తాను ఆశిస్తున్నట్టు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ సీజన్‌లో చెన్నై ఎంత దారుణంగా ఆడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరుకుంది. ప్లేఆఫ్స్ ఆశలు ఇక లేనట్టే. దీంతో, వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో సమూల మార్పులు, ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ మొదలైంది. అయితే, తదుపరి జరగబోయేదేంటో చెన్నై జట్టు చిన్న తలా సురైశ్ రైనా చెప్పేశాడు. సీఎస్‌కే తరపున ధోనీ కనీసం మరో సీజన్ అయినా ఆడతాడని పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో అయినా సీఎస్‌కే పటిష్ఠ ప్లానింగ్‌తో అడుగుపెడుతుందని తాను విశ్వసిస్తున్నట్టు సురేశ్ రైనా అన్నాడు.
‘‘ వచ్చేసారైనా వారు మంచి ప్రణాళికతో వస్తారని అనుకుంటున్నా. ఇక ధోనీ కూడా కనీసం మరో సీజన్ అయినా చెన్నై తరపున ఆడతాడు. ఇక జట్టు కూర్పు విషయంలో ధోనీదే తుది నిర్ణయం అని వారు అంటుంటారు. కానీ నిజం చెప్పాలంటే నేను ఇప్పటివరకూ ఏ ఆక్షన్‌కూ హాజరు కాలేదు. ఆ చర్చల్లో నేను భాగం కాలేదు. ఓ ప్లేయర్‌పై ఎమ్‌ఎస్ సలహాలు వాళ్లు అడుగుతూ ఉండొచ్చు. కానీ అతడు ఈ వ్యవహారంలో అంత ఎక్కువగా ఇన్‌వాల్వ్ అయ్యాడని నేను అనుకోను. ఆక్షన్ వ్యవహారాన్ని కోర్ గ్రూప్ హ్యాండిల్ చేస్తుంది. తనకు ఏ ప్లేయర్లు కావాలో ధోనీ సలహా ఇస్తూ ఉండొచ్చు. అందులో కొందరిని జట్టులో కొనసాగిస్తూ ఉండొచ్చు’’ అని అన్నాడు.
43 ఏళ్ల వయసులో కూడా ధోనీ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాడని సురేశ్ రైనా ప్రశంసించాడు. ‘‘అతడు సీఎస్‌కే బ్రాండ్ కోసం, తన పేరు కోసం, అభిమానుల కోసం కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా వికెట్ కీపింగ్, కప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జట్టు భారం మొత్తం తన భుజాలపై మోస్తున్నాడు. మరి మిగతా పది మంది ప్లేయర్స్ ఏం చేస్తున్నట్టు? రూ.17 కోట్లు, రూ.18 కోట్లు, రూ.12 కోట్లు తీసుకుంటున్న వాళ్లంతా తమ కెప్టెన్ అంచనాలకు అనుగూణంగా రెస్పాండ్ కావట్లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. మ్యాచ్‌లు గెలిపించేది ఎవరు? వచ్చే మ్యాచ్‌లో ఈ ప్లేయర్ ఆడతాడని నమ్మొచ్చా.. కొందరు జట్టులో ఏళ్లుగా ఉంటున్నారు. కానీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఓటములు ఎదురవుతున్నాయి. అవే తప్పులు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి’’ అంటూ సీఎస్‌కేలో రాబోయే మార్పుల గురించి సురేశ్ రైనా స్పష్టమైన హింట్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే
IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు.. ఇరు జట్లకు చెరో పాయింట్
ఆసియా బాక్సింగ్‌లో 43 పతకాలు ఖాయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 27 , 2025 | 12:56 PM