Share News

ఆసియా బాక్సింగ్‌లో 43 పతకాలు ఖాయం

ABN , Publish Date - Apr 27 , 2025 | 02:23 AM

ఆసియా జూనియర్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్ల జోరు మీదున్నారు. శనివారం మరో నలుగురు సెమీఫైనల్‌ చేరారు. అండర్‌-17 బాలురలో అమన్‌ సివాచ్‌...

ఆసియా బాక్సింగ్‌లో 43 పతకాలు ఖాయం

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా జూనియర్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్ల జోరు మీదున్నారు. శనివారం మరో నలుగురు సెమీఫైనల్‌ చేరారు. అండర్‌-17 బాలురలో అమన్‌ సివాచ్‌ (63కి.), దేవాన్ష్‌ (80కి.), బాలికల్లో సిమర్జీత్‌ కౌర్‌ (60కి.), హిమాన్షి (70కి.) క్వార్టర్స్‌లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. దీంతో టోర్నీలో భారత్‌కు 43 పతకాలు ఖాయమయ్యాయి. సెమీఫైనల్‌ చేరిన బాక్సర్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. అండర్‌-15 విభాగంలో కనీసం 25, అండర్‌-17 కేటగిరిలో 18 పతకాలు మనకు లభించనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 02:23 AM