ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

South Africa vs Australia: ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

ABN, Publish Date - Jun 14 , 2025 | 06:01 PM

లార్డ్స్‌ గ్రౌండ్‌ సాక్షిగా సౌతాఫ్రికా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీతో ఆసీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసి తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 27 ఏళ్ల తర్వాత దక్కించుకుంది.

South Africa vs Australia

27 ఏళ్లుగా ప్రపంచ కప్‌లలో దక్షిణాఫ్రికా జట్టు ప్రతిసారి అన్‌లక్కీ టీం అనే పేరుతో కొనసాగింది. కానీ తాజాగా ఆ ట్యాగ్‌కు చెక్ పెట్టింది సౌతాఫ్రికా జట్టు (South Africa vs Australia). న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాత తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్ గెలుచుకున్న మూడో జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు. అనేక ప్రతి కూలతలను చీల్చేసి రికార్డుల్ని తిరగరాసింది.

భారత్ చేతిలో ఓడి..

1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి మెజర్ టైటిల్ ఇదే. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరుకుని భారత్ చేతిలో ఓడిన బాధ ఈ విజయంతో తీరిందని చెప్పవచ్చు. ఇప్పుడు దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీ, టెంబా బావుమా కెప్టెన్సీ ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికాకు ఈ విజయాన్ని అందించేలా చేశాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలవడానికి 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆస్ట్రేలియా.

వీరిద్దరూ కీలకం..

ఆట నాల్గో రోజు మొదటి సెషన్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ 207 బంతుల్లో 136 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్రమ్ తొలి ఇన్నింగ్స్‌లో తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతను ఔటైనప్పుడు జట్టు గెలవడానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరం. మరోవైపు కెప్టెన్ టెంబా బావుమా, నాల్గో రోజు మొదటి సెషన్‌లో ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 66 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా జట్టు కాస్త ఇబ్బందికరంగా కనిపించినప్పటికీ చివరికి లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది.

లార్డ్స్‌లో ఐదోసారి 200+

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై మరోసారి అద్భుత విజయాన్ని అందుకుంది. 2008లో పెర్త్‌లో 414 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా, 2002లో డర్బన్‌లో 335 పరుగుల ఛేజింగ్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా, లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై మరోసారి గొప్ప పరుగుల వేటను పూర్తి చేస్తూ, తమ టెస్ట్ చరిత్రలో ఈ జట్టుపై మూడో అత్యధిక ఛేజింగ్ విజయాన్ని సాధించింది. ఇది లార్డ్స్‌లో సంయుక్తంగా రెండో అత్యధిక టార్గెట్ ఛేజింగ్ కావడం విశేషం. అంతేకాకుండా, ఈ మైదానంలో టెస్ట్‌లలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇది ఐదోసారి.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌ మరింత ఈజీ


For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 06:33 PM