Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా?
ABN, Publish Date - Aug 14 , 2025 | 06:57 AM
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 25 సంవత్సరాల అర్జున్‌కు బుధవారం (ఆగస్టు 13) ఎంగేజ్‌మెంట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulakar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 25 సంవత్సరాల అర్జున్ (Arjun Tendulkar)కు బుధవారం (ఆగస్టు 13) ఎంగేజ్‌మెంట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి (Arjun Tendulkar Engagement). ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సాన్యా చందోక్ (Saanya Chandok)తో అర్జున్ నిశ్చితార్థం అయినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం.
రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సాన్యా చందోక్ ఉంగరాలు మార్చుకున్నట్టు సమాచారం. అయితే ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ముంబైలోని బడా వ్యాపారవేత్త అయిన రవి ఘాయ్ మనుమరాలే ఈ సాన్యా చందోక్. రవి ఘాయ్ కుటుంబం ముంబైలోని హాస్పిటాలిటీ రంగంలో ఉంది. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్‌తో పాటూ బ్రూక్లిన్ క్రీమరీ ఐస్‌క్రీమ్ వ్యాపారం, ఇంకా పలు ఇతర బిజినెస్‌లు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. లెఫ్టార్మ్ పేసర్, బ్యాటర్ అయిన అర్జున్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 37 వికెట్లు తీసి, 532 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇప్పటివరకు 24 టీ-20లు ఆడిన అర్జున్ 27 వికెట్లు తీసి 119 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి..
ప్రేయసితో రొనాల్డో నిశ్చితార్థం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 14 , 2025 | 06:57 AM