Share News

Cristiano Ronaldo Engagement: ప్రేయసితో రొనాల్డో నిశ్చితార్థం

ABN , Publish Date - Aug 13 , 2025 | 02:06 AM

ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగ్వెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జార్జినా సోషల్‌ మీడియా ద్వారా మంగళవారం ప్రకటించింది. నిశ్చితార్థం సందర్భంగా...

Cristiano Ronaldo Engagement: ప్రేయసితో రొనాల్డో నిశ్చితార్థం

రియాద్‌: ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగ్వెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జార్జినా సోషల్‌ మీడియా ద్వారా మంగళవారం ప్రకటించింది. నిశ్చితార్థం సందర్భంగా రొనాల్డో తనకు తొడిగిన ఉంగరం ఫొటోను 31 ఏళ్ల జార్జినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తొలిసారిగా 2016లో మాడ్రిడ్‌లోని ఓ షాప్‌లో కలుసుకున్న వీరిద్దరు.. అప్పటినుంచి కలిసే ఉంటున్నారు. కానీ, ఇన్నాళ్లకు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. రొనాల్డో ద్వారా జార్జినా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, 40 ఏళ్ల రొనాల్డోకు మరో ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో ఒకరు రొనాల్డో మొదటి భార్యకు జన్మించగా.. మరో ఇద్దరిని రొనాల్డో సరోగసి ద్వారా కన్నాడు. మొత్తం ఐదుగురు పిల్లలు రొనాల్డో, జార్జినా వద్దే పెరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 02:06 AM