Punjab vs Mumbai: నేడు పంజాబ్ vs ముంబై మధ్య కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - May 26 , 2025 | 08:13 AM
నేడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Punjab vs Mumbai) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు పోటాపోటీగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో 69వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మధ్య (Punjab vs Mumbai) జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ టోర్నమెంట్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ ప్రారంభంలో బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ, పిచ్ నెమ్మదించడం ప్రారంభమవుతుంది. స్పిన్ బౌలర్లు బౌన్స్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు నెమ్మదిగా సాగే పిచ్ స్పిన్ బౌలర్లకు ఆధిపత్యం చెలాయించడానికి అవకాశాన్ని ఇస్తుంది.
ఇరు జట్లకు కూడా..
ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ఎక్కువగా బౌలింగ్ ఎంచుకుంటుంది. గణాంకాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. గత 62 మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 23 సార్లు మాత్రమే గెలిచింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన జట్టు 38 సార్లు మ్యాచ్ గెలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 217/6 (సన్‌రైజర్స్ హైదరాబాద్), అత్యల్ప స్కోరు 59 పరుగులు (రాజస్థాన్ రాయల్స్). ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం రెండు జట్లకు కూడా చాలా ముఖ్యం. శ్రేయాస్ అయ్యర్ జట్టు 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా జట్టు 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఎవరు గెలుస్తారంటే..
ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొత్తం 32 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ముంబై ఇండియన్స్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ మాత్రం 15 సార్లు గెలిచింది. ఈ ఇద్దరి మధ్య ఇప్పటివరకు టై లేదా సూపర్ ఓవర్ లాంటి మ్యాచ్ జరగలేదు. గణాంకాలను పరిశీలిస్తే MI పైచేయి సాధించేటట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం పంజాబ్ గెలిచేందుకు 39 శాతం ఛాన్స్ ఉండగా, ముంబై జట్టుకు 61 శాతం అవకాశం ఉంది.
ఇరు జట్ల ప్లేయింగ్ 11
PBKS ప్లేయింగ్ 11 అంచనా జట్టులో ప్రియాంశ్ అర్యా, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జావియర్ బార్ట్లెట్, అర్షదీప్ సింగ్, యూజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్ (ఇంపాక్ట్ ప్లేయర్)
MI ప్లేయింగ్ 11 అంచనా జట్టులో రయాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్య (కెప్టెన్), నామన్ ధీర్, కొర్బిన్ బోష్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బూమ్రా, కర్న్ శర్మ (ఇంపాక్ట్ ప్లేయర్)
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 08:14 AM