ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli New Look: విరాట్ కోహ్లీ కొత్త లుక్ చూశారా? రెండు నెలల విరామం తర్వాత ప్రాక్టీస్..

ABN, Publish Date - Aug 09 , 2025 | 09:36 AM

ఐపీఎల్ తర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన కోహ్లీ గతేడాదే టీ-20లకు కూడా వీడ్కోలు పలికాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 19-25 మధ్య ఆస్ట్రేలియాలో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడబోతోంది.

Virat Kohli New Look

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తర్వాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ సాధన ప్రారంభించాడు. ఐపీఎల్ తర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన కోహ్లీ గతేడాదే టీ-20లకు కూడా వీడ్కోలు పలికాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 19-25 మధ్య ఆస్ట్రేలియాలో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడబోతోంది (Virat Kohli New Look).

ఆ వన్డే సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లోనే నివసిస్తున్న కోహ్లీ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సహాయక కోచ్ నయీమ్ అమిన్ పర్యవేక్షణలో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. సాధన అనంతరం అమిన్‌తో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తనకు సహాయం చేసినందుకు అమిన్‌కు కోహ్లీ ధన్యవాదాలు తెలియజేశాడు.

ఆ ఫొటోలో కోహ్లీ కొత్త లుక్‌లో కనిపించాడు. ఆ ఫొటోలో కోహ్లీ పూర్తిగా తెల్లటి గెడ్డంతో కనిపిస్తున్నాడు. కోహ్లీ గెడ్డం ఇంతకు ముందే నెరిసినప్పటికీ దానికి రంగు వేసుకునేవాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ గెడ్డానికి రంగు వేసుకోవడం మానేశాడు. గత నెలలో లండన్‌లో టీమిండియా ఆటగాళ్లతో కలిసి కోహ్లీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కోహ్లీ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గెడ్డానికి నాలుగు రోజులకు ఒకసారి రంగేసుకుంటున్న తాను టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించకుండా ఎలా ఉంటానని వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

హైదర్‌ అలీపై రేప్‌ కేసు

నన్నూ వదిలేయండి


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 09 , 2025 | 09:36 AM