Share News

Ashwin Likely To Leave CSK: నన్నూ వదిలేయండి

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:46 AM

సంజూ శాంసన్‌ మాదిరే ఆర్‌.అశ్విన్‌ కూడా తన సొంత జట్టును వీడాలని భావిస్తున్నాడు. ఈమేరకు చెన్నై

Ashwin Likely To Leave CSK: నన్నూ వదిలేయండి

చెన్నై: సంజూ శాంసన్‌ మాదిరే ఆర్‌.అశ్విన్‌ కూడా తన సొంత జట్టును వీడాలని భావిస్తున్నాడు. ఈమేరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే)కు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే ఇరు వర్గాల నుంచి ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడలేదు. పదేళ్ల తర్వాత ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ గత సీజన్‌లోనే మళ్లీ చెన్నైకి ఆడాడు. 9 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసిన ఈ వెటరన్‌ను మెగా వేలంలో రూ.9.75 కోట్లకు దక్కించుకుంది. అయితే 2022-2024 మధ్య రాజస్థాన్‌కు ఆడిన అశ్విన్‌ తిరిగి అదే జట్టులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

ఇద్దరిని ఇస్తేనే..: రాజస్థాన్‌ కెప్టెన్‌ శాంసన్‌ను తీసుకోవాలనుకుంటున్న సీఎ్‌సకేకు ఆ ఫ్రాంచైజీ ఓ షరతు విధించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి శాంసన్‌ను అతడి ధర రూ.18 కోట్లు ఇచ్చి చెన్నై తీసుకోవాలనుకుంది. అయితే రాజస్థాన్‌ మాత్రం నగదు కాకుండా శాంసన్‌కు బదులు ఇద్దరు సీఎ్‌సకే ఆటగాళ్లను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోందట. దీంతో ప్రస్తుతానికి ఈ విషయమై ప్రతిష్ఠంభన నెలకొంది. ఒకవేళ ఈ చర్చలకు పరిష్కారం లభించకపోతే శాంసన్‌ వేలానికి వెళ్లక తప్పదు.

Updated Date - Aug 09 , 2025 | 03:46 AM