ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025: ముంబైలో ఇళ్ల ధరల్లాగే.. బుమ్రా కూడా

ABN, Publish Date - Jun 01 , 2025 | 01:50 AM

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మెరుపులు, బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ముంబై గుజరాత్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం బుమ్రా విలువను ముంబై ఇళ్ల ధరలతో పోల్చిన హార్దిక్‌ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.

ముల్లాన్‌పూర్‌: బ్యాట్‌తో రోహిత్‌ శర్మ.. బంతితో బుమ్రా అదరగొట్టడంతో ముంబై ఇండియన్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత వీరిద్దరిపై ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ‘ముంబైలోని ఇళ్ల ధరల తరహాలో.. బుమ్రా కూడా ఎంతో విలువైన వాడు’ అని హార్దిక్‌ కొనియాడాడు. మ్యాచ్‌ చేజారుతుందనే అనుమానం కలిగితే.. వెంటనే బుమ్రాను రంగంలోకి దించుతానన్నాడు. ఆ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ధాటిగా ఆడతూ గుజరాత్‌ విజయంపై ఆశలు రేపారు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన బుమ్రా.. కళ్లుచెదిరే యార్కర్‌తో సుందర్‌ను బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌పై ముంబై పట్టు బిగించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 01 , 2025 | 01:53 AM