IPL 2025: ఐపీఎల్ చరిత్రలో ఎవరకీ అందని రికార్డ్.. గుజరాత్ ఓపెనర్ ఖాతాలో అరుదైన మైలురాయి
ABN, Publish Date - Apr 12 , 2025 | 08:52 AM
గిల్ సారథ్యంలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ నాలుగు విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయాల్లో కీలక పాత్ర ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్‌ది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
పెద్ద పెద్ద క్రికెటర్లు లేకపోయినా ఈ ఐపీఎల్‌లో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు. గిల్ సారథ్యంలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ నాలుగు విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయాల్లో కీలక పాత్ర ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)ది అని చెప్పడం అతిశయోక్తి కాదు. తాజాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు (Sai Sudharsan Record).
ఒక వేదికలో వరుసగా ఐదు అర్ధశతకాలు సాధించిన ఒకే ఒక ఇండియన్ ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్‌లోని అహ్మదబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో 2024లో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో 84, సెంచరీ చేశాడు. తాజా సీజన్‌లో అదే స్టేడియంలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో ఒకే వేదికలో వరుసగా ఐదు అర్ధశతకాలు సాధించాడు. అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు.
ఐపీఎల్‌లో 30 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సాయి సుదర్శన్ రెండో స్థానంలో నిలిచాడు. సాయి సుదర్శన్ ఇప్పటివరకు 1307 పరుగులు చేశాడు. మొదటి స్థానంలో షాన్ మార్ష్ (1338) ఉన్నాడు. సాయి సుదర్శన్ తర్వాత క్రిస్ గేల్ (1141), కేన్ విలియమ్సన్ (1096), మాథ్యూ హెడెన్ (1082) పరుగులతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni Out: ధోనీ ఔట్ కాలేదా.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం
IPL 2025, KKR vs CSK: చెన్నైకు స్పిన్ ఉచ్చు.. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 12 , 2025 | 08:52 AM