Share News

MS Dhoni Out: ధోనీ ఔట్ కాలేదా.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం

ABN , Publish Date - Apr 12 , 2025 | 08:36 AM

శుక్రవారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అయితే ధోనీ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

MS Dhoni Out: ధోనీ ఔట్ కాలేదా.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం
MS Dhoni

నాయకత్వ పగ్గాలు ధోనీ చేతికి వచ్చినా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాత మారలేదు. ఈ సీజన్‌లో వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది (CSK vs KKR). ముందుగా బ్యాటింగ్‌కు దిగి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అయితే ధోనీ అవుట్ (Dhoni Out) విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ధోనీ అవుట్ కాకపోయినా, అవుట్ ఇచ్చినట్టు సీఎస్కే అభిమానులు (CSK Fans) సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.


ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి ఒక పరుగు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. నరైన్ వేసిన బంతి ధోనీ ప్యాడ్‌కు తగలడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. వెంటనే ధోనీ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రా ఎడ్జ్ ప్రకారం బంతి బ్యాట్‌కు స్వల్పంగా తగిలినట్టు కనబడింది. అయినా థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించాడు. ఆ నిర్ణయంపై ధోనీ కూడా ఆశ్చర్యపోయాడు. అసంతృప్తిగా వెనుదిరిగాడు.


సాధారణంగా ధోనీ రివ్యూ కోరాడంటే కచ్చితంగా సానుకూల నిర్ణయమే వస్తుందని చాలా మంది బలంగా నమ్ముతారు. అయితే నిన్నటి మ్యాచ్‌లో వ్యతిరేకంగా నిర్ణయం వచ్చింది. బంతి బ్యాట్‌‌కు తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్స్ కనబడుతున్నా అవుట్ ఇవ్వడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బ్యాట్‌కు బాల్ తగిలింది కాబట్టే ధోనీ రివ్యూకు వెళ్లాడని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

IPL 2025: ఐపీఎల్ ఎవరు చూస్తారు.. పాకిస్తాన్ లీగ్‌నే అందరూ చూస్తారు.. పాక్ పేసర్ మాటలు వింటే నవ్వుకోవాల్సిందే


IPL 2025, KKR vs CSK: చెన్నైకు స్పిన్ ఉచ్చు.. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2025 | 08:36 AM