IPL 2025: ఐపీఎల్ ఎవరు చూస్తారు.. పాకిస్తాన్ లీగ్‌నే అందరూ చూస్తారు.. పాక్ పేసర్ మాటలు వింటే నవ్వుకోవాల్సిందే
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:01 PM
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లో కూడా కొందరు విదేశీ ఆటగాళ్లు ఆడుతుంటారు. ప్రతి ఏటా ఈ లీగ్ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరుగుతుంది. అయితే ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాల వల్ల పీఎస్‌ఎల్ ఏప్రిల్‌కు మారింది.

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025). ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను ఆడేందుకు దేశ విదేశీ ఆటగాళ్లందరూ ఎంతో ఆసక్తి చూపుతారు. ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (PSL) నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లో కూడా కొందరు విదేశీ ఆటగాళ్లు ఆడుతుంటారు. ప్రతి ఏటా ఈ లీగ్ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరుగుతుంది. అయితే ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాల వల్ల పీఎస్‌ఎల్ ఏప్రిల్‌కు మారింది. ఈ రోజు (శుక్రవారం) మొదలు కాబోతోంది.
ఐపీఎల్‌కు పోటీగా తీసుకొచ్చిన పీఎస్‌ఎల్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. విదేశీ పాపులర్ క్రికెటర్లు ఎవరూ పీఎస్‌ఎల్ ఆడడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌తో పోటీపడుతున్నందున పీఎస్‌ఎల్‌కు వ్యూయర్‌షిప్ కూడా ఉండదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఎక్కడ బాగా ఆడితే ఆ టోర్నీని చూసేందుకు అభిమానులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. పీఎస్‌ఎల్‌లో ఆటగాళ్లు బాగా ఆడితే.. వ్యూయర్స్ అందరూ ఐపీఎల్‌ను వదిలేసి పీఎస్‌ఎల్ చూస్తారు అని హసన్ అలీ పేర్కొన్నాడు.
హసన్ అలీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హసన్ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. హసన్ అలీ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడని ఒకరు, పీఎస్‌ఎల్ ఒకటి జరుగుతోందని తనకు ఇప్పటివరకు తెలియదని మరొకరు కామెంట్ చేశారు. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఈ లీగ్‌ను 2015లో ప్రారంభించారు. ఇందులో కేవలం 6 టీమ్స్ మాత్రమే ఉంటాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..