ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 PBKS vs RCB: ఫైనల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పంజాబ్‌పై ఘన విజయం

ABN, Publish Date - May 29 , 2025 | 10:04 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరిసింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలకమైన మ్యాచ్‌లో కూడా సత్తా చాటింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది.

RCB WON BY 8 WICKETS against PBKS

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరిసింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలకమైన మ్యాచ్‌లో కూడా సత్తా చాటింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. ఏకంగా 8 వికెట్లు తేడాతో గెలుపొందింది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి (PBKS vs RCB). ఈ మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది (IPL 2025).


టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. అందరూ విఫలమయ్యారు. మార్కస్ స్టోయినిస్ (26) తప్ప మరెవ్వరూ 20 పరుగులు కూడా చేయలేదు. దీంతో పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంచింది.


బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకుండా నియంత్రించి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. సుయాష్ శర్మ, హాజెల్‌వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెప్పర్డ్ ఒక్కో వికెట్ తీశారు. 102 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని ఆరంభంలో పంజాబ్ బౌలర్లు కాస్త కంగారు పెట్టారు. కీలక కోహ్లీ (12) వికెట్‌ను త్వరగానే పడగొట్టారు.


కోహ్లీ అవుటైనా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56) మాత్రం తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించాడు. అతడికి మయాంక్ అగర్వాల్ (19) కూడా సహకరించాడు. దీంతో ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పంజాబ్ నిర్దేశించిన టార్గెట్‌ను 10 ఓవర్లలోనే ఛేదించింది. నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో ఆదివారం జరిగబోయే క్వాలిఫయర్-2లో పంజాబ్ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.


ఇవి కూడా చదవండి..

IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్


Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 10:08 PM