Share News

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

ABN , Publish Date - May 29 , 2025 | 06:25 PM

టెస్ట్‌లలో ఎన్నో రికార్డులు కలిగిన కోహ్లీ ఇలా అనూహ్యంగా వైదొలగడం మాజీలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ రిటైర్మెంట్ గురించి తాజాగా హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. తన కూతురు ఈ విషయమై కోహ్లీని ప్రశ్నించిందని భజ్జీ చెప్పాడు.

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..
Virat Kohli

దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్‌ల నుంచి వైదొలగిన వెంటనే కోహ్లీ కూడా తన నిర్ణయాన్ని తెలియజేశాడు. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. టెస్ట్‌లలో ఎన్నో రికార్డులు కలిగిన కోహ్లీ ఇలా అనూహ్యంగా వైదొలగడం మాజీలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ రిటైర్మెంట్ గురించి తాజాగా హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కూడా స్పందించాడు. తన కూతురు ఈ విషయమై కోహ్లీని ప్రశ్నించిందని భజ్జీ చెప్పాడు.


విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయం తన కూతురు హినాయాకు ఆందోళన కలిగించిందని హర్భజన్ చెప్పాడు. ఆ విషయం గురించి మొబైల్ ద్వారా కోహ్లీని తన కూతురు ప్రశ్నించిందని భజ్జీ తెలిపాడు. *నేను హినాయా. విరాట్, మీరు ఎందుకు రిటైర్ అయ్యారు* అని అడిగిందట. దానికి కోహ్లీ స్పందిస్తూ.. *బేటా.. ఇదే సమయం..* అంటూ రిప్లై ఇచ్చాడని భజ్జీ చెప్పాడు. ఏది ఉత్తమమో కోహ్లీకి తెలుసు అని హర్భజన్ అన్నాడు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను గిల్ స్వీకరించిన సంగతి తెలిసిందే.


గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించడంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ లేకుండా ఇంగ్లండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయడం టీమిండియాకు అంత సులభం కాదని, అయితే గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం సరైన నిర్ణయమని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో పరాజయాలు ఎదురైనా కుర్రాళ్లు చాలా నేర్చుకుంటారని అన్నాడు.


ఇవీ చదవండి:

రాసిపెట్టుకోండి.. కప్పు ఆర్సీబీదే..

పొల్లుపొల్లు కొట్టుకున్న క్రికెటర్లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 06:25 PM