Share News

IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్

ABN , Publish Date - May 29 , 2025 | 08:55 PM

టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తూ వస్తున్న పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఫైనల్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడ్డారు. దీంతో బెంగళూరు ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంచగలిగారు.

IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
RCB vs PBKS

టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తూ వస్తున్న పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఫైనల్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడ్డారు. మొదట బ్యాటింగ్ చేసి 101 పరుగులు మాత్రమే చేసి బెంగళూరు ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంచగలిగారు. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి (PBKS vs RCB). ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది (IPL 2025).

rcb4.jpg


టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. అందరూ విఫలమయ్యారు. మార్కస్ స్టోయినిస్ (26) తప్ప మరెవ్వరూ 20 పరుగులు కూడా చేయలేదు. దీంతో పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంచింది.


బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకుండా నియంత్రించి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. సుయాష్ శర్మ, హాజెల్‌వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెప్పర్డ్ ఒక్కో వికెట్ తీశారు. మరి, ఈ స్వల్ప స్కోరును పంజాబ్ ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ఎలిమినేటర్ ఆడే అవకాశం ఉంటుంది.


ఇవీ చదవండి:

రాసిపెట్టుకోండి.. కప్పు ఆర్సీబీదే..

పొల్లుపొల్లు కొట్టుకున్న క్రికెటర్లు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 08:55 PM