ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KL Rahul-Rajat Patidar: కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్.. కోపంగా పక్కకు వెళ్లిపోయిన రజత్ పటీదార్

ABN, Publish Date - Apr 12 , 2025 | 09:45 AM

గురువారం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 93 పరుగులు చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ చేసుకున్న సంబరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

KL Rahul

ఈ సీజన్‌ (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వరుస విజయాలతో జోరుమీదుంది. గురువారం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందింది (DC vs RCB). ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 93 పరుగులు చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ (KL Rahul) చేసుకున్న సంబరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిచ్‌ మీద బ్యాట్‌తో తడుతూ, ఇది నా అడ్డా అని సూచిస్తూ కాంతారా స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు (KL Rahul Celebrations).


మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనాలు చేసుకునే సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించిన కేఎల్ రాహుల్‌ను బెంగళూరు ఆటగాళ్లు అభినందించారు. కోహ్లీ కూడా రాహుల్‌తో చేయి కలిపి వెన్నుతట్టాడు. వరుసగా ఆర్సీబీ ఆటగాళ్లు రాహుల్‌తో కరచాలనం చేశారు. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ (Rajat Patidar) మాత్రం రాహుల్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా పక్క నుంచి వెళ్లిపోయాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నిజానికి లఖ్‌నవూ వదులుకోవాలని నిర్ణయించుకోవడంతో ఈ సీజన్ నుంచి బెంగళూరు తరఫున ఆడాలని కేఎల్ రాహుల్ కోరుకున్నాడు. ఒక దశలో బెంగళూరుకు కెప్టెన్‌సీ బాధ్యతలు కూడా రాహుల్‌కే దక్కుతాయని ప్రచారం జరిగింది. అయితే వేలంలో రాహుల్‌పై బెంగళూరు అసలు ఆసక్తి కనబరచలేదు. దీంతో ఢిల్లీ టీమ్ అతడిని దక్కించుకుంది. కేఎల్ రాహుల్ బెంగళూరుకు చెందిన ఆటగాడు. రాయల్ ఛాలెంజర్స్ జట్టుతోనే తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni Out: ధోనీ ఔట్ కాలేదా.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం


IPL 2025: ఐపీఎల్ ఎవరు చూస్తారు.. పాకిస్తాన్ లీగ్‌నే అందరూ చూస్తారు.. పాక్ పేసర్ మాటలు వింటే నవ్వుకోవాల్సిందే


IPL 2025, KKR vs CSK: చెన్నైకు స్పిన్ ఉచ్చు.. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2025 | 09:45 AM