IPL 2025 CSK vs PBKS: పంజాబ్ ఘన విజయం.. చెన్నైకు మళ్లీ పరాజయమే
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:27 PM
వరుస పరాజయాలతో కునారిల్లుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరో అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ బౌలర్లు చేతులెత్తేయడంతో పరాజయం పాలైంది. 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
వరుస పరాజయాలతో కునారిల్లుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరో అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ బౌలర్లు చేతులెత్తేయడంతో పరాజయం పాలైంది. 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రోజు చెన్నైలోని స్వంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో (Chepauk Stadium) పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడింది (CSK vs PBKS). ఈ మ్యాచ్‌లో పరాజయం పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంది. చెన్నైకు వరుసగా ఇది మూడో పరాజయం
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలో పంజాబ్ బౌలర్లు చెలరేగారు. 48 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి చెన్నైను బెంబేలెత్తించారు. అయితే ఆ దశలో ఆల్ రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెన్నైను ఆదుకున్నాడు. బ్రెవిస్ (32)తో కలిసి నాలుగో వికెట్‌కు 70కు పైగా పరుగులు జోడించాడు. బ్రెవిస్ అవుటైన తర్వాత సామ్ కర్రన్ మరింత రెచ్చిపోయాడు.
యుజ్వేంద్ర ఛాహల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చెన్నైకు షాకిచ్చాడు. పంజాబ్‌ను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దీంతో చెన్నై ఆశించిన స్థాయిలో భారీ స్కోరు చేయలేకపోయింది. దీంతో చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లలో ఛాహల్ నాలుగు, అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీశారు. యన్‌సెన్, ఒమరజ్జీ, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు.
191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రభ్ సిమ్రన్ (54), ప్రియాంశ్ ఆర్య (23) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ప్రియాంశ్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (72) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో పంజాబ్ 19.4 ఓవర్లలో చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై బౌలర్లలో పతిరణ, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: చెన్నై టీమ్ మెరుగుపడాలంటే.. ధోనీ రిటైర్ కావడం మంచిది: ఆడమ్ గిల్‌క్రిస్ట్
IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 30 , 2025 | 11:32 PM