Shubhman Gill: శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్..
ABN, Publish Date - Jul 05 , 2025 | 08:12 PM
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో గిల్ శతకంతో భారీ స్కోరు సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అలరించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు. మరో అద్భుత శతకం సాధించాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో గిల్ శతకంతో భారీ స్కోరు సాధించింది. (Ind vs Eng).
తొలి ఇన్నింగ్స్‌లో ఎంతో ఓర్పు, సంయమనంతో చూడ చక్కని ఇన్నింగ్స్ ఆడిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వేగంగా పరుగులు చేశాడు. మరో సెంచరీ చేశాడు. 127 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు (Shubhman Gill Record). ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో గిల్ 369 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (344 వెస్టిండీస్‌పై) పేరిట ఉండేది. అలాగే ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తొమ్మిదో అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు
ప్రస్తుతానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. గిల్‌తో పాటు రిషభ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలు సాధించారు. గిల్‌కు తోడు రవీంద్ర జడేజా (23 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లండ్‌పై 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీ విరామం తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే ఆలోచనలో టీమిండియా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి, చివరి రోజు టీమిండియా బౌలర్ల ప్రదర్శన పైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంటుంది.
ఇవీ చదవండి:
ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 05 , 2025 | 08:45 PM