ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tom Bailey: మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జేబులోంచి పడిన మొబైల్.. వీడియో వైరల్

ABN, Publish Date - May 05 , 2025 | 10:04 AM

ఓ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ సందర్భంగా ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో ఓ ఆటగాడి ప్యాంట్ నుంచి ఫోన్ కిందపడింది. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tom Bailey mobile video

క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికర వీడియోలు వెలుగులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో బయటకొచ్చింది. వీడియోలో ఓ ఆటగాడు క్రికెట్ ఆడుతున్న క్రమంలో అతని ప్యాంట్ జేబులోనుంచి ఫోన్ కిందపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అసలు ఆడే క్రమంలో ఫోన్ తీసుకెళ్ల వచ్చే అనే క్రికెట్ నియమాలపై చర్చ మొదలైంది.

నియమాలు ఏం చెబుతున్నాయి

క్రికెట్ రూల్స్ ప్రకారం ఆటగాళ్లు మైదానంలో మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడంపై స్పష్టమైన నిబంధనలు ఏమి లేవు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నియమావళి ప్రకారం, గేమ్ సమయంలో ఆటగాళ్లు ఏదైనా బాహ్య పరికరాలతో సంబంధం కలిగి ఉండటం నిషేధం. ఈ సందర్భంలో లంకాషైర్ బౌలర్ టామ్ బెయిలీ జేబులో మొబైల్ ఫోన్ ఉండటం ఆటకు ఎలాంటి ప్రభావం చూపలేదు. కాబట్టి అంపైర్ దీన్ని తీవ్రంగా పరిగణించలేదు.


ఫోన్ రింగ్ అయితే

అయితే ఈ సంఘటనతో ఆటగాళ్లు మైదానంలో ఏ వస్తువులను తీసుకెళ్లవచ్చు, ఏవి తీసుకెళ్లకూడదు అనే చర్చకు దారితీసింది. ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు ఇలాంటి విషయాలను నివారించడానికి కఠిన నియమాలు అవసరమని చెబుతున్నారు. ఒకవేళ ఫోన్ రింగ్ అయితే లేదా ఆటగాడు ఫోన్‌లో మాట్లాడటం మొదలెడితే ఎలా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెయిలీ జేబులోంచి జారిన మొబైల్ ఫోన్‌ను అంపైర్ తిరిగి ఆటగాడికి ఇచ్చాడా లేదా అనే విషయం కూడా తెలియలేదు. అయితే ఈ సంఘటన ఆటకు ఎలాంటి అంతరాయం కలిగించకపోవడం విశేషం. లాంకషైర్ జట్టు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. బెయిలీ కూడా తన బ్యాటింగ్‌ను పూర్తి చేశాడు.


కామెంట్స్ వైరల్

మ్యాచ్ రెండో రోజున లాంకషైర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 401/8 స్కోర్ చేసింది. ఈ సమయంలో బౌలర్ టామ్ బెయిలీ బ్యాటింగ్‌కు దిగాడు. రెండు పరుగుల కోసం రన్నింగ్ చేస్తున్న సమయంలో, అనూహ్యంగా అతని ప్యాంటు జేబులోంచి మొబైల్ ఫోన్ జారిపోయింది. ఈ ఘటన మైదానంలోని అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. బెయిలీ స్వయంగా కూడా తొలుత తన ఫోన్ జారిపోయిన విషయాన్ని గుర్తించలేదు.

గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్ ఈ విషయాన్ని మొదట గమనించాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. టామ్ బెయిలీ ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 22 పరుగులు చేసి ఔట్ కాకుండా నిలిచాడు. అయితే, అతని బ్యాటింగ్ కంటే, ఈ మొబైల్ ఫోన్ ఘటనే ఎక్కువ చర్చనీయాంశమైంది. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆటలో లాంకాషైర్, గ్లౌసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వింత సంఘటన జరిగింది.


ఇవి కూడా చదవండి:

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం


Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..


Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 10:09 AM