Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు
ABN, Publish Date - Jan 26 , 2025 | 08:08 PM
Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.
భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ బ్యాట్ విసిరేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పట్టరాని కోపంతో అతడు బ్యాట్ విసిరేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ గిల్ బ్యాట్ విసిరేస్తున్న ఫొటోలు, వీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే గిల్ తన పనేదో తాను అన్నట్లు బిహేవ్ చేస్తాడు. అలాగని పూర్తిగా రిజర్వ్‌డ్‌గా ఉండడు. తన వయసు ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లతోనూ ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. గ్రౌండ్‌లో పెద్దగా ఎమోషన్స్ చూపించడు. అలాంటోడు బ్యాట్ విసరడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
అంపైర్‌పై కోపంతో..
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న గిల్.. తిరిగి టచ్‌లోకి వచ్చేందుకు రంజీల బాట పట్టాడు. నేషనల్ డ్యూటీ లేని టైమ్‌లో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ బీసీసీఐ తీసుకొచ్చిన రూల్ కూడా శుబ్‌మన్ రంజీల్లో ఆడేందుకు మరో రీజన్‌గా చెప్పొచ్చు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో ఆడిన గిల్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీతో మెరిశాడు. 171 బంతుల్లో 102 పరుగులతో ఆకట్టుకున్నాడు. సెంచరీ తర్వాత శ్రేయస్ గోపాల్ ఓవర్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే అంపైర్ డెసిషన్ విషయంలో గిల్ సీరియస్ అయ్యాడు.
గిల్ టీమ్ ఓటమి!
అంపైర్ ఔట్ ఇవ్వడంపై గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాకపోయినా అంపైర్ ఔట్ ఇవ్వడం, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాదిరిగా రివ్యూ చేసేందుకు డీఆర్ఎస్ ఆప్షన్ లేకపోవడంతో గిల్ సీరియస్ అయ్యాడు. తాను నాటౌట్ అయినా అంపైర్ ఔట్ ఇచ్చాడని ఆగ్రహానికి లోనయ్యాడు. పట్టరాని కోపంతో బ్యాట్‌ను విసిరేశాడు. ఆ తర్వాత మళ్లీ బ్యాట్ అందుకొని అంపైర్, అపోజిషన్ టీమ్ వైపు చూస్తూ గంభీరంగా చూస్తూ పెవిలియన్ వైపు కదిలాడు. ఈ మ్యాచ్‌లో గిల్ జట్టు పంజాబ్ ఓడిపోయింది. కర్ణాటక ఇన్నింగ్స్ 207 పరుగులతో ఘనవిజయం సాధించింది.
ఇదీ చదవండి:
క్రికెట్‌లో ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడూ చూసుండరు.. గాల్లో పల్టీలు కొడుతూ
నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్
ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 08:13 PM