Virat Kohli: అప్పటివరకు ఆడుతూనే ఉంటాడు.. కోహ్లీ రిటైర్మెంట్‌పై తేల్చేసిన రాహుల్
ABN, Publish Date - Mar 01 , 2025 | 03:05 PM
KL Rahul: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై స్టైలిష్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ప్రశంసల జల్లులు కురిపించాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అపూర్వం అని మెచ్చుకున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. దర్జాగా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. రేపు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్ధమవుతోంది మెన్ ఇన్ బ్లూ. అన్ని విభాగాల్లోనూ జట్టు బలంగా ఉంది. ఏవైనా నెగెటివ్‌లు ఉన్నా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చూసుకుంటాడనే భరోసా అందరిలో ఉంది. దీనికి కారణం పాక్‌పై అతడు సెంచరీతో జోరు మీదుండటమే. ఫామ్‌లేమితో కొన్నాళ్లుగా ఇబ్బందులు పడిన కింగ్.. ఇప్పుడు తిరిగి లయను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌కు విరాట్ అందించిన సేవలను అతడు కొనియాడాడు.
అప్పటివరకు నో బ్రేక్
‘భారత క్రికెట్‌కు కోహ్లీ అపూర్వ సేవలు అందించాడు. టీమిండియా తరఫున అతడు ఆడిన తీరును వర్ణించడానికి మాటలు సరిపోవు. గత మ్యాచ్‌లో అతడు సెంచరీ కొట్టడం చాలా సంతోషంగా అనిపించింది. అతడికి ఉన్న సామర్థ్యానికి బిగ్ మ్యాచెస్‌లో ఇలాంటి బిగ్ నాక్స్ అలవోకగా ఆడతాడు. ఫామ్ గురించి దిగులు చెందడం వృథా. టైమ్ వస్తే అతడ్ని ఎవరూ ఆపలేరు’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. విరాట్‌లో ఇంకా ఎంతో ఆట మిగిలే ఉందని.. అతడు మరిన్ని సెంచరీలు కొట్టాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు కేఎల్.
తగ్గని పరుగుల దాహం
కోహ్లీ రిటైర్మెంట్ రూమర్లపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా స్పందించాడు. అతడు ఇప్పట్లో రిటైర్ అవ్వడని ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు. ‘కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడు. క్రికెట్ అంటే అతడికి ఇంకా ఇష్టం పోలేదు. గేమ్‌ను అతడు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆట మీద అతడికి ఉన్న ప్యాషన్ తగ్గలేదు. అతడు అలవోకగా మరో 3 నుంచి 4 ఏళ్ల పాటు టీమిండియాకు ఆడతాడు’ అని బంగర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ సుదీర్ఘ కాలం ఆడటం ఖాయమని అటు రాహుల్ అనడం.. విరాట్ మరో మూడ్నాలుగు ఏళ్ల పాటు ఆడటం పక్కా అని మాజీ కోచ్ అనడంతో ఇప్పట్లో రిటైర్మెంట్ లేనట్లేనని నెటిజన్స్ చెబుతున్నారు. కోహ్లీ ఇలా ఆడితే ఎన్నాళ్లైనా అతడి ఆటను చూస్తూ ఆస్వాదిస్తామని, సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు. కాగా, చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగర్ ట్రైనింగ్‌లో బ్యాటింగ్ సాధన చేశాడు కోహ్లీ. ఫామ్‌ను అందుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు.
ఇవీ చదవండి:
ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు
రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 01 , 2025 | 03:10 PM