Mumbai Indians: రాక్షసులను దించుతున్న ముంబై.. లెక్కలు మారడం ఖాయం!
ABN, Publish Date - May 20 , 2025 | 02:49 PM
ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ మీద కన్నేసిన ముంబై ఇండియన్స్.. కీలక మ్యాచులకు ముందు రాక్షసులను రంగంలోకి దింపుతోంది. వీళ్లు గానీ రాణిస్తే ఇంకో కప్పు కొట్టకుండా ఎంఐని ఎవరూ ఆపలేరు. మరి.. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్ మీద దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు అధికారికంగా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. డీసీ కంటే ఎంఐకి క్వాలిఫికేషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ఆడే 2 మ్యాచుల్లోనూ నెగ్గితే హార్దిక్ సేన ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ముంబై ఫోకస్ మాత్రం కప్పు మీదే ఉంది. క్వాలిఫికేషన్ కంటే కూడా ప్లేఆఫ్స్‌లో జరిగే పోరాటాల మీదే ఆ టీమ్ ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ముగ్గురు రాక్షసులను దించుతోంది హార్దిక్ సేన. మరి.. ఆ రాక్షసులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్..
ఈ సీజన్‌లో అదరగొట్టిన విల్ జాక్స్, ర్యాన్ రికల్టన్, కార్బిన్ బాష్ ముంబైకి దూరమవనున్నారు. వెస్టిండీస్‌తో వైట్‌బాల్ సిరీస్ ఉండటంతో జాక్స్ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్లు రికల్టన్, బాష్ స్వదేశానికి పయమనవుతున్నారు. లీగ్ స్టేజ్ మ్యాచుల తర్వాత వీళ్లు ఎంఐకి అందుబాటులో ఉండరు. దీంతో ఎలా అని ఆందోళన పడుతున్న అభిమానులకు శుభవార్త చెప్పింది ముంబై. వీళ్ల స్థానాల్లో ముగ్గురు రాక్షసులను దించుతున్నట్లు స్పష్టం చేసింది ఎంఐ. ఇంగ్లండ్ పించ్‌హిట్టర్ జానీ బెయిర్‌స్టో, అదే దేశానికి చెందిన పేస్ గన్ రిచర్డ్ గ్లీసన్‌తో పాటు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసింది. వీళ్లు ముగ్గురు ప్లేఆఫ్స్ మ్యాచుల నుంచి అందుబాటులో ఉంటారు.
ముగ్గురూ ముగ్గురే..
రీప్లేస్‌మెంట్స్‌గా ముంబై ఎంపిక చేసిన ఆటగాళ్లు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. బెయిర్‌స్టో ఎంత డేంజరస్ బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు బాదుడే బాదుడు అన్నట్లు బ్యాటింగ్ చేస్తాడు. అతడు గానీ క్లిక్ అయితే వార్ వన్‌సైడ్ అవ్వాల్సిందే. మరో బ్యాటర్ చరిత్ అసలంక పూర్తిగా వైవిధ్యమైన బ్యాటర్. ఒక్కో పరుగుతో ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేయడం అతడి స్టైల్. వికెట్లు పోకుండా కాపాడటం, పరిస్థితిని బట్టి గేర్లు మార్చడం, అవసరమైనప్పుడు అటాక్ చేయడం అసలంకకు బాగా తెలుసు. ఇక, మూడో రీప్లేస్‌మెంట్ అయిన పేసర్ రిచర్డ్ గ్లీసన్ కూడా మంచి ఆప్షనే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా అన్ని ప్రముఖ టీ20 లీగ్స్‌లోనూ ఆడిన అనుభవం అతడి సొంతం. తెలివిగా బంతులు వేస్తూ బ్యాటర్లను కట్టడి చేసే గ్లీసన్ ఎక్స్‌పీరియెన్స్ ఎంఐకి మేలు చేయడం పక్కా అనే చెప్పాలి. కప్పు వేటలో ఉన్న ముంబైకి ఈ ముగ్గురు స్టార్లు రాణిస్తే తిరుగుండదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఇవీ చదవండి:
దిగ్వేష్‌తో గొడవపై అభిషేక్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 02:58 PM