ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ కీలక నిర్ణయం..

ABN, Publish Date - Jun 05 , 2025 | 06:40 PM

Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ముందుకు వచ్చింది.

Bengaluru Stampede

ఇంటర్‌నెట్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ముందుకు వచ్చింది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది.


ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘నిన్న బెంగళూరులో జరిగిన సంఘటన ఆర్సీబీ కుటుంబంలో ఎంతో బాధను, వేదనను కలుగ జేసింది. ఎంతో గౌరవంతో.. సంఘీభావంగా.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్సీబీ ఆర్థికసాయం చేస్తుంది. గాయపడ్డవారికి కూడా వైద్య సాయం అందేలా చూస్తుంది. మేము చేసే ప్రతీ పనిలో మా ఫ్యాన్స్ మాకు తోడుగా ఉంటున్నారు. ఈ విషాద సమయంలోనూ మాకు తోడుగా ఉన్నారు’ అని పేర్కొంది.


కప్ కొట్టిన సంతోషం ఆవిరైంది

ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ 10 సార్లు ప్లేఆఫ్‌కు వెళ్లింది. ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, కప్పు గెలవలేకపోయింది. ఇప్పుడు నాలుగో సారి ఫైనల్‌కు చేరుకుంది. అభిమానులతో పాటు యావత్ కర్ణాటక రాష్ట్రం గర్వపడేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి కప్ కొట్టింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్టేడియం దగ్గరకు రావటంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది చనిపోయారు. ఆర్సీబీ టీమ్‌కు కప్ కొట్టిన సంతోషం ఒక్క రోజు కూడా లేకుండా పోయింది.


ఇవి కూడా చదవండి

అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు..

చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు

Updated Date - Jun 05 , 2025 | 07:07 PM