MLA Maganti Gopinath: అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు..
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:45 PM
MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలియటంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయన్ని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఏఐజీ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఐసీయూలో మాగంటి
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలియటంతో మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఎమ్మెల్యే మాగంటి ఐసీయూలో ఉన్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
చిన్నస్వామి స్టేడియం విషాదం.. విచారణ జరిపిన హైకోర్టు
గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌లో రాఫెల్ విడిభాగాల తయారీ..