ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రమాదంలో మహిళ ప్రాణాలు.. కుక్క ఎంత పని చేసింది..

ABN, Publish Date - May 06 , 2025 | 07:25 AM

viral video: ఉదయం 9 గంటల సమయంలో ఆమె మార్నింగ్ వాక్ కోసం అని బయటకు వెళ్లింది. అపార్ట్‌మెంట్స్ ముందున్న ప్రదేశంలో నడుస్తూ ఉంది. అదే సమయంలో ఓ మహిళ తన కుక్కతో అక్కడికి వచ్చింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళను చూడగానే కుక్క రెచ్చిపోయింది.

viral video

సిటీలో ఓ చెత్త కల్చర్ ఉంది. కొంతమంది కుక్కల్ని బయట తిప్పడానికి తీసుకొస్తూ ఉంటారు. వాటి మెడకు తాడు ఉన్నా అవి మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటాయి. మీదకు ఉరికి కరవడానికి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో జనం వాటినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. తాజాగా, ఓ మహిళ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. ఏకంగా ఇరవై అడుగులపైనుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. నడుం విరిగిపోయింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది.


ఈ దారుణమైన సంఘటన గ్రేటర్ నోయిడాలో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడాకు చెందిన 37 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఎకో విలేజ్ 1 సొసైటీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తోంది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె మార్నింగ్ వాక్ కోసం అని బయటకు వెళ్లింది. అపార్ట్‌మెంట్స్ ముందున్న ప్రదేశంలో నడుస్తూ ఉంది. అదే సమయంలో ఓ మహిళ తన కుక్కతో అక్కడికి వచ్చింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళను చూడగానే కుక్క రెచ్చిపోయింది.


దాడి చేయడానికి మీదకు ఉరికింది. దీంతో ఆమె భయపడిపోయింది. అక్కడినుంచి ముందుకు పరుగులు తీసింది. అలా పరుగులు తీస్తూ 20 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయింది. ఆమె పైనుంచి కిందపడిపోవటం చూసిన ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. ఆమె లేవలేకపోయింది. అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళను పరీక్షించిన డాక్టర్లు వెన్నెముక విరిగినట్లు తెలిపారు. సర్జరీ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

Viral Video: ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..

AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు

Updated Date - May 06 , 2025 | 07:33 AM